మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడింది. 288 మంది సభ్యులుండే అసెంబ్లీకి అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి.
ముంబై: మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు శనివారం నోటిఫికేషన్ వెలువడింది. 288 మంది సభ్యులుండే అసెంబ్లీకి అక్టోబర్ 15వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. వీటితోపాటు బీడ్ ఎంపీ సీటుకు కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయుని ఆయున చెప్పారు. బీజేపీ నేత గోపీనాథ్ ముండే వురణంతో ఈ సీటు ఖాళీ అయిన విషయం తెలిసిందే. శనివారం నుంచే ఎన్నికల ప్రక్రియు ప్రారంభమైందని ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు.
► ఈనెల 27వతేదీ నామినేషన్ల దాఖలుకు చివరి రోజు.
► అక్టోబర్ 1 నామినేషన్ల ఉపసంహరణకు తుదిగడువు.
► అక్టోబర్ 15వ తేదీన పోలింగ్
► అక్టోబర్ 19వ తేదీన ఓట్ల లెక్కింపు
కాగా వచ్చే నెల 15న జరగనున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ శనివారం ప్రారంభమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం (ఈసీ) శనివారం జారీచేసింది.