ఢిల్లీ: గద్వాల ఎమ్మెల్యే విషయంలో ఇప్పుడు డీకే అరుణతో పాటు కాంగ్రెస్ కు కూడా అనుకోకుండా ఆనందం దక్కింది. ఇటీవల గద్వాల ఎన్నిక విషయంలో తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా పేర్కొంటూ నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని అసెంబ్లీ సెక్రటరీకి లేఖ రాసింది. డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ జారీ చేసిన నోటిఫికేషన్‌ను గెజిట్‌లో ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు చేసింది.
కేసు బ్యాక్ గ్రౌండ్ ఏంటీ.?
గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డిని ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ అప్పట్లో ఓ కేసు నమోదయింది. తెలంగాణ హైకోర్టు గతనెలలో వరుసబెట్టి అనర్హత పిటిషన్లపై విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ప్రజాప్రతినిధుల అనర్హత కేసులపై త్వరతగతిన తీర్పులు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాల ఇచ్చిన నేపథ్యంలోనే తెలంగాణ హైకోర్టు వాటిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇక గద్వాల కేసులో కూడా తెలంగాణ హైకోర్టు గత నెల 24వతేదీన తీర్పు వెలువరించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని కృష్ణమోహన్‌రెడ్డిపై వేటు వేసింది. ఆయన ఎన్నిక చెల్లదంటూ సంచలన తీర్పు ఇచ్చింది. రెండో స్థానంలో నిలిచిన డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది.
డీ కే అరుణ ఏం చేసింది.?
తీర్పు వచ్చిన వెంటనే ఎన్నికల సంఘం తెలంగాణ CEOని కలిసి హైకోర్టు తీర్పు ప్రతి అందించారు డీకే అరుణ. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇప్పుడు స్పందించింది. తెలంగాణ CEO ఇచ్చిన విజ్ఞప్తితో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ గెజిట్ జారీ చేసింది. డీకే అరుణను 2018 నుంచి ఇప్పటివరకు ఎమ్మెల్యేగా ప్రకటించాలని సూచించింది.
Called upon Shri Vikas Raj, Chief Electoral Officer of Telengana, and gave him a copy of the judgement of the Hon'ble High Court's judgement in my favour. Former MLC Shri @N_RamchanderRao garu accompanied.
— D K Aruna (@aruna_dk) September 1, 2023
I hope that the Hon'ble High Court's judgement will be respected and… pic.twitter.com/IB9Fug7Hwu
కాంగ్రెస్ కు ఎందుకు అనందం?
కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడన్న చందంగా .. గద్వాల ఇప్పుడు కాంగ్రెస్ ఖాతాలో పడ్డట్టయింది. ఎందుకంటే 2018లో గద్వాలలో డీకే అరుణ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసింది. ఓడిపోయినా.. గెలిచినా.. ఆ ఎన్నికకు సంబంధించినంత వరకు డీకే అరుణ కాంగ్రెస్ కు సంబంధించిన వ్యక్తే. 2018 తర్వాత డీకే అరుణ పార్టీ మారి బీజేపీలో చేరింది. అయితే ఇప్పుడు తీర్పు రావడంతో సాంకేతికంగా ఆమె ఎమ్మెల్యే అయినట్టే.. అలాగే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగానే పరిగణించాల్సిందే.
2018 ఎన్నికలో ఏం జరిగింది?
2018 ఎన్నికల్లో TRS (ఇప్పుడు BRS) తరపున కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ తరపున డీకే అరుణ నిలబడ్డారు.
పార్టీ | అభ్యర్థి పేరు | ఓట్లు |
TRS | కృష్ణమోహన్‌రెడ్డి | 100415 |
Cong | DK అరుణ | 72155 |
BJP | వెంకటాద్రి | 1936 |
ఇదీ చదవండి: CWC: కాంగ్రెస్ కీలక నిర్ణయం.. రఘువీరా సహా వీరికి చోటు
Comments
Please login to add a commentAdd a comment