
గోపీనాథ్ ముండేకి లోక్ సభ సంతాపం
న్యూఢిల్లీ : 16వ లోక్‌సభ కొలువుదీరింది. ఉదయం 11గంటలకు ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైనట్లు ప్రకటించారు. లోక్‌సభ సెక్రటరీ జనరల్ కొత్త సభ్యుల జాబితా స్పీకర్‌కు సమర్పించారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు లోక్‌సభ నివాళులర్పించింది. ముండే మృతికి సంతాప సూచకంగా సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఈ సందర్భంగా గోపీనాథ్ ముండే అందించిన సేవలను స్పీకర్ సభ్యులకు గుర్తుచేశారు. అనంతరం సభను గురువారానికి వాయిదా వేశారు. రేపు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక ఉంటుందని పేర్కొన్నారు. అంతకు ముందు ప్రోటెం స్పీకర్గా కాంగ్రెస్ సీనియర్ నేత కమల్నాథ్తో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రమాణ స్వీకారం చేయించారు.