ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీల నివాళి | ysrcp-mps-condole-to-gopinath-munde | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 3 2014 5:13 PM | Last Updated on Fri, Mar 22 2024 11:07 AM

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన గోపీనాథ్ ముండేకు వైఎస్ఆర్ సీపీ ఎంపీలు నివాళులర్పించారు. వైఎస్ఆర్ సీపీ ఎంపీలు మేకపాటి రాజమోహన్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ముండే పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. దేశం ఓ గొప్ప నాయకున్ని కోల్పోయిందని వైఎస్ఆర్ సీపీ ఎంపీలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. గోపీనాథ్ ముండే ఆకస్మిక మరణం దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు. ముండే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement