'కాసిన్ని మంచినీళ్లివ్వు.. నన్ను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లు'... ఇవీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మాట్లాడిన చిట్టచివరి మాటలు. ప్రమాదం తర్వాత ఆయన ముక్కు కొద్దిగా అదిరిందని, అంతేతప్ప శరీరం మీద పెద్దగా గాయాలు కూడా ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి దగ్గరలోనే ఉన్న పోలీసులు ఈ విషయం చెప్పారు. ప్రమాదం తర్వాత కేంద్ర మంత్రి బాగా షాకయ్యారని, అందువల్లే బహుశా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉంటుందని ముండే కార్యదర్శి ఎస్. నాయర్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగాల్సిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబై వెళ్లడానికి బయల్దేరిన ఆయన.. ఇంకా విమానాశ్రయానికి కూడా వెళ్లకుండానే ప్రాణాలు కోల్పోయారు.
కాగా, గోపీనాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామంలో జరుగుతాయి. ముంబైలోని వర్లి ప్రాంతంలో గల ముండే స్వగృహంలో సాయంత్రం వరకు ఉంచుతారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ముంబై నుంచి లాతూరు వరకు విమానంలో తీసుకెళ్లి, అక్కడినుంచి బీద్ జిల్లాకు రోడ్డుమార్గంలో తీసుకెళ్తారు. ముండే స్వగ్రామమైన పర్లి-వైద్యనాథ్ గ్రామంలో కొన్ని గంటలపాటు ఉంచి, అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వర్తిస్తారు.
'మంచినీళ్లివ్వు.. ఆస్పత్రికి తీసుకెళ్లు'
Published Tue, Jun 3 2014 2:58 PM | Last Updated on Thu, Aug 30 2018 3:58 PM
Advertisement