last words
-
Wah Ustad Wah: జాకీర్ హుస్సేన్ చివరి పోస్ట్ వైరల్
‘‘ఎంతటి కళాకారుడైనా.. ఎంత ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగానే ఉండాలి’’.. ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ తరచూ చెప్పే మాట ఇది. మూడేళ్ల వయసుకే తబలాపై చిట్టి చేతులేసి.. ఏడేళ్లకే స్టేజ్ షో ఇచ్చి.. 12 ఏళ్లకే అంతర్జాతీయ సంగీత కచేరీలు.. ఆరు దశాబ్దాల పాటు కొనసాగిన ఆయన సంగీత ప్రయాణం ముగిసింది. జాకీర్ హుస్సేన్ మరణంతో.. ఆయన జ్ఞాపకాలను కొందరు తెరపైకి తెస్తున్నారు. ఆయన నేపథ్యం, ఆయన పరిచయాలు, ఆసక్తికర ఘటనలు.. ఇలా ఎన్నింటినో పంచుకుంటున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ తబలా విద్వాంసుడు.. చివరి పోస్టుగా ‘అద్భుతమైన క్షణం’ ఉంచారు. View this post on Instagram A post shared by Zakir Hussain (@zakirhq9)ఈ అక్టోబర్‌లో అమెరికాలో ఉన్న ఆయన ఇంటి వరండాలో విశ్రాంతి తీసుకుంటూ.. ప్రకృతి వీడియోను స్వయంగా చిత్రీకరించి షేర్ చేశారాయన. ఆ పోస్ట్ ఇప్పుడు ట్రెండింగ్‌లోకి వచ్చింది.ఓ గురువు నేర్పడం కాదు.. ఓ విద్యార్థి నేర్చుకోవడం అనేది ముఖ్యం. గురువును ఆ విద్యార్థి నేర్పే విధంగా ఇన్స్పైర్ చేయాలి. అంటూ ఆయన చెప్పిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. అలాగే.. నా మొదటి గురువు నా తండ్రే. ఎన్ని అవార్డులు వచ్చినా.. ఎప్పుడూ నేర్చుకోగలగడం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని అనుకోకూడదని మా నాన్న చెబుతుండేవారు. ఓ కళాకారుడు ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు. మంచి విద్యార్థిగా ఉండాలి. అప్పుడే విజయం సాధిస్తారు.గొప్ప గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు వారు కూడా ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉన్నామన్నారు. వారి మాటలు నాలో స్ఫూర్తినింపాయి. నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నాను. అయినా ఎప్పుడూ దీని గురించి ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే కనీసం 15 మంది పేర్లు చెబుతాను.. అని జాకీర్ హుస్సేన్ మాటలు ‘‘వహ్ ఉస్తాద్ వహ్..’’ అని నెటిజన్లతో అనిపిస్తున్నాయి.క్లిక్ చేయండి: ఇక సెలవు మిత్రమా.. చితి వద్ద జాకీర్ హుస్సేన్ కన్నీళ్లు -
నేను చనిపోతే శేఖర్,జానీ చేసేది ఇదే.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్
టాలీవుడ్లో దాదాపు 1500 పాటలకు కొరియోగ్రఫీ చేసిన రాకేశ్ మాస్టర్ (53) ఆకస్మిక మరణంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. సినీ పరిశ్రమ నుంచి ఆయనకు సోషల్ మీడియా ద్వార పలువురు సంతాపం ప్రకటించారు. గతంలో ఆయన వివిధ సందర్భాల్లో పంచుకున్న విషయాలను అభిమానులు షేర్ చేస్తున్నారు. రాకేష్ మాస్టర్ చనిపోయన తర్వాత ఏం జరుగుతుందో ఓ ఇంటర్వ్యూలో ముందే ఇలా చెప్పాడు. (ఇదీ చదవండి: ఎక్కడ సమాధి చేయాలో ముందే కోరిన రాకేష్ మాస్టర్) 'నా మరణం తర్వాత శేఖర్, సత్య మాస్టర్లు పూల మాలలతో వస్తారు. కానీ వారిలో బాధ కంటే సంతోషమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వారికి ఏడుపు రాకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్నట్లు నటిస్తారు. గతంలో నేను వారి కోసం చేసిన రెండు మంచిమాటలు చెబుతూ.. ఎప్పుడెప్పుడూ డెడ్‌బాడీని తీసేస్తారా..? అక్కడి నుంచి వెళ్లిపోదామా? అని' ఉంటారని చెప్పుకొచ్చాడు. జానీ మాస్టర్‌కు మాత్రం ఏడుద్దామని అనుకున్నా కన్నీళ్లు రావు.. దీంతో జెండూ బామ్‌ను పూసుకొని మ్యానేజ్ చేస్తాడని తెలిపాడు. ఇలా తన అంత్యక్రియలు పూర్తి అయిన తర్వాత వాళ్లందరూ చాలా రిలాక్స్ అవుతారని గతంలో తెలిపాడు. మెడికల్ కాలేజీకి మృతదేహం తన మరణం తర్వాత డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చెందాలని, అందుకు ముందే ఏర్పాట్లు చేసుకున్నానని తెలిపాడు. కాబట్టి తన శిష్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాడు. తన అంత్యక్రియలకు వారెవరూ ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. చివరకు తన కుమారుడు కూడా చితికి నిప్పు పెట్టాల్సిన పని లేదన్నాడు. తన అస్తికలు తీసుకొని గంగానదిలో కలపాల్సిన అవసరం కూడా లేదన్నాడు. అలాంటి వాటిపై నమ్మకం లేదు.. అందుకే మరణానంతరం తన డెడ్‌బాడీని మెడికల్ కాలేజీకి చేరాలని నిర్ణయించుకున్నానన్నాడు. దీంతో కొంతమంది మెడికల్ విద్యార్థులకు శవ పంచనామాకు ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చాడు. ఇలా అందరూ శరీర దానం చేయడం వల్ల మెడికల్ విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నాడు. (ఇదీ చదవండి: Rakesh Master: ఆ ఒక్క మాటతో ఫేమస్ అయిన రాకేష్ మాస్టర్) -
'మంచినీళ్లివ్వు.. ఆస్పత్రికి తీసుకెళ్లు'
'కాసిన్ని మంచినీళ్లివ్వు.. నన్ను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లు'... ఇవీ కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే మాట్లాడిన చిట్టచివరి మాటలు. ప్రమాదం తర్వాత ఆయన ముక్కు కొద్దిగా అదిరిందని, అంతేతప్ప శరీరం మీద పెద్దగా గాయాలు కూడా ఏమీ కాలేదని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి దగ్గరలోనే ఉన్న పోలీసులు ఈ విషయం చెప్పారు. ప్రమాదం తర్వాత కేంద్ర మంత్రి బాగా షాకయ్యారని, అందువల్లే బహుశా ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చి ఉంటుందని ముండే కార్యదర్శి ఎస్. నాయర్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న బీద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో జరగాల్సిన భారీ ర్యాలీలో పాల్గొనేందుకు ముంబై వెళ్లడానికి బయల్దేరిన ఆయన.. ఇంకా విమానాశ్రయానికి కూడా వెళ్లకుండానే ప్రాణాలు కోల్పోయారు. కాగా, గోపీనాథ్ ముండే అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం పూర్తి అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామంలో జరుగుతాయి. ముంబైలోని వర్లి ప్రాంతంలో గల ముండే స్వగృహంలో సాయంత్రం వరకు ఉంచుతారు. బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ముంబై నుంచి లాతూరు వరకు విమానంలో తీసుకెళ్లి, అక్కడినుంచి బీద్ జిల్లాకు రోడ్డుమార్గంలో తీసుకెళ్తారు. ముండే స్వగ్రామమైన పర్లి-వైద్యనాథ్ గ్రామంలో కొన్ని గంటలపాటు ఉంచి, అనంతరం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వర్తిస్తారు.