Former ICC president Sharad Pawar
-
పవార్‌కే ‘పవర్’
ఎంసీఏ అధ్యక్షుడిగా విజయం ముంబై: ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికయ్యారు. బుధవారం ఆసక్తికరంగా సాగిన ఎంసీఏ ఎన్నికల్లో పవార్ 27 ఓట్ల తేడాతో తన ప్రత్యర్థి విజయ్ పాటిల్‌పై విజయం సాధించారు. పవార్‌కు మొత్తం 172 ఓట్లు రాగా, పాటిల్‌కు 145 ఓట్లు పడ్డాయి. పవార్ వర్గానికే చెందిన మాజీ క్రికెటర్ దిలీప్ వెంగ్‌సర్కార్, ఆశిష్ షెలార్ ఉపాధ్యక్షులుగా, నితిన్ దలాల్ కోశాధికారిగా, పీవీ శెట్టి సంయుక్త కార్యదర్శులుగా గెలిచారు. -
ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్
అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు ముంబై: ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి క్రికెట్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మంగళవారం పవార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. 2012లో ఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న ఆయన, ఆ తర్వాత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. 2001 తర్వాత ఆయన ఈ పదవి కోసం మరోసారి ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆరుసార్లు పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పవార్‌కు ప్రత్యర్థిగా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు విజయ్ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న ఎంసీఏ ఎన్నికలు జరగనున్నాయి. పాటిల్‌కు శివసేన మద్దతు ఇస్తోంది. శివసేనతో పవార్‌కు మంచి సంబంధాలున్నాయి. కాబట్టి చివరి నిమిషంలో పాటిల్ తప్పుకొని పవార్ మరోసారి పోటీ లేకుండా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. భారత మాజీ క్రికెటర్లు దిలీప్ వెంగ్‌సర్కార్, అభయ్ కురువిల్లా కూడా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిలిచారు.