ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్ | In MCA elections Pawar | Sakshi
Sakshi News home page

ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్

Published Wed, Jun 10 2015 3:11 AM | Last Updated on Tue, Oct 2 2018 2:53 PM

ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్ - Sakshi

ఎంసీఏ ఎన్నికల బరిలో పవార్

అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు
ముంబై:
ఐసీసీ మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ మరోసారి క్రికెట్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ముంబై క్రికెట్ సంఘం (ఎంసీఏ) ఎన్నికల్లో ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. మంగళవారం పవార్ తన నామినేషన్‌ను దాఖలు చేశారు. 2012లో ఐసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న ఆయన, ఆ తర్వాత క్రికెట్ వ్యవహారాలకు దూరంగా ఉన్నారు. 2001 తర్వాత ఆయన ఈ పదవి కోసం మరోసారి ఎన్నికల్లో పోరాడుతున్నారు. ఈ మధ్య కాలంలో ఆరుసార్లు పవార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

పవార్‌కు ప్రత్యర్థిగా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత ఉపాధ్యక్షుడు విజయ్ పాటిల్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ నెల 17న ఎంసీఏ ఎన్నికలు జరగనున్నాయి. పాటిల్‌కు శివసేన మద్దతు ఇస్తోంది. శివసేనతో పవార్‌కు మంచి సంబంధాలున్నాయి. కాబట్టి చివరి నిమిషంలో పాటిల్ తప్పుకొని పవార్ మరోసారి పోటీ లేకుండా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. భారత మాజీ క్రికెటర్లు దిలీప్ వెంగ్సర్కార్, అభయ్ కురువిల్లా కూడా ఉపాధ్యక్ష పదవి కోసం ఎన్నికల బరిలో నిలిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement