
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దాదాపు విజయాలు తప్ప అపజయం ఎరుగకుండా దూసుకెళుతున్న దిల్ రాజు కొత్త రికార్డును సొంతం చేసుకోనున్నారు. 2017 సంవత్సరానికి గాను 'టాలీవుడ్ ప్రొడ్యుసర్ ఆఫ్ ది ఇయర్'గా నిలవనున్నారు. ఒక్క ఏడాదిలో ఆరు చిత్రాలను నిర్మించి ఈ ఘనత దక్కించుకోనున్నారు.
మరే నిర్మాత కూడా చిత్ర నిర్మాణం విషయంలోనూ, విజయాల వరుసలోనూ ఈ ఏడాది దిల్ రాజుకు దగ్గరలో లేరు. రేపు నాని హీరోగా నటించిన ఎంసీఏ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుండగా ఇప్పటికే విడుదలైన ఐదు చిత్రాలు ఘన విజయం సాధించాయి. 2017లో సంక్రాంతి బరిలో దిగిన శతమానం భవతి చిత్రం భారీ విజయం అందుకోవడంతోపాటు జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. ఆ తర్వాత నేను లోకల్, డీజే, ఫిదా, రాజా ది గ్రేట్ చిత్రాలు నిర్మించి విడుదల చేసి విజయం సాధించి రికార్డు సృష్టించారు.
Comments
Please login to add a commentAdd a comment