10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్ | 10 from the I cet counseling | Sakshi
Sakshi News home page

10 నుంచి ఐసెట్ కౌన్సెలింగ్

Published Mon, Sep 9 2013 4:25 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM

10 from the I cet counseling

విజయనగరం టౌన్, న్యూస్‌లైన్ : ఎంబీఏ, ఎంసీఏల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన ఐసెట్ ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కౌన్సెలింగ్ అధికారులు టి.ఆర్.ఎస్.లక్ష్మి, అప్పలనాయుడు, సత్యనారాయణ ఆదివారం తెలిపారు.  స్థానిక పూల్‌బాగ్  ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో  అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తామన్నారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి తమకు ఆదేశాలందాయని తెలిపారు.  ఈ నెల 10న ఒకటి నుంచి 20 వేల ర్యాంకు వరకు, 11న 20,001 నుంచి 40 వేల ర్యాంకు వరకు, 12న 40,001 నుంచి 60 వేల ర్యాంకు వరకు, 13న 60,001 నుంచి 80 వేల ర్యాంకు వరకు, 14న 80,001 నుంచి లక్ష ర్యాంకు వరకు, 15వ తేదీన లక్షా ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఉండే అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు.  
 
 అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌కి సంబంధించి ఓసీ, బీసీ కేటగిరీలకు చెందిన వారైతే రూ.600, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.300 రుసుం చెల్లిం చాల్సి ఉంటుందన్నారు.  ఈ  నెల 15 నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు జరుగుతుందన్నారు.  
 
 వెబ్ ఆప్షన్లకు సంబంధించి  15, 16 తేదీల్లో ఒకటో ర్యాంకు నుంచి 40 వేల ర్యాంకు వరకు,  17,18 తేదీల్లో 40,001 నుంచి 80వేల ర్యాంకు వరకు, 19,20 తేద్లీ 80,001 నుంచి చివరి ర్యాంకు వరకు అభ్యర్థులు  వెబ్‌ఆప్షన్లు పొందుపర్చుకోవచ్చని తెలిపారు. వెబ్‌ఆప్షన్లలలో ఏమైనా లోటుపాట్లు ఉంటే ఈ నెల 21న ఆప్షన్లులో మార్పులు, చేర్పులు చేసుకునే  అవకాశం ఉందన్నారు. ఐసెట్‌కి సంబంధించి జిల్లాలో 15 కళాశాలలున్నాయన్నారు. ఐసెట్‌కి సంబంధించి జిల్లాలో 1232 మంది అభ్యర్థులు పరీక్ష రాశారన్నారు. అభ్యర్థులు కౌన్సెలింగ్‌కి సంబంధించి ఎటువంటి లోటుపాట్లు కలగకుండా చర్యలు తీసుకున్నామని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement