7,8వ తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్‌ అడ్మిషన్లు | mba. mca spot admissions on 7, 8th | Sakshi
Sakshi News home page

7,8వ తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్‌ అడ్మిషన్లు

Published Sat, Sep 3 2016 11:04 PM | Last Updated on Mon, Sep 4 2017 12:09 PM

mba. mca spot admissions on 7, 8th

ఎచ్చెర్ల: ఐసెట్‌ తుది విడత కౌన్సెలింగ్‌ పూర్తయిన నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ మిగులు సీట్లుకు డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ యూనివర్సిటీలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్‌ పెద్దకోట చిరంజీవులు శనివారం తెలిపారు. వర్సిటీలో ఎంసీఏలో 28 సీట్లు, ఎంబీఏలో 12 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఎంసీఏకు ఎంపీసీ, ఎంపీసీ కంప్యూటర్స్‌ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఫీజు స్ట్రక్చర్‌ ఎంబీఏకు రూ.10,000, ఎంసీఏకు రూ. 12,500, కౌన్సెలింగ్‌ రుసుం రూ.300 చెల్లించాలన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో 7, 8 తేదీల్లో నిర్వహించే కౌన్సెలింగ్‌కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, టీసీ, ఇతర వర్సిటీ విద్యార్థులు మైగ్రేషన్‌ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement