spot addmissions
-
7,8వ తేదీల్లో ఎంబీఏ, ఎంసీఏ స్పాట్ అడ్మిషన్లు
ఎచ్చెర్ల: ఐసెట్ తుది విడత కౌన్సెలింగ్ పూర్తయిన నేపథ్యంలో ఎంబీఏ, ఎంసీఏ మిగులు సీట్లుకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ పెద్దకోట చిరంజీవులు శనివారం తెలిపారు. వర్సిటీలో ఎంసీఏలో 28 సీట్లు, ఎంబీఏలో 12 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఎంబీఏకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత, ఎంసీఏకు ఎంపీసీ, ఎంపీసీ కంప్యూటర్స్ ఉత్తీర్ణత చెందిన విద్యార్థులు అర్హులని తెలిపారు. ఫీజు స్ట్రక్చర్ ఎంబీఏకు రూ.10,000, ఎంసీఏకు రూ. 12,500, కౌన్సెలింగ్ రుసుం రూ.300 చెల్లించాలన్నారు. వర్సిటీ ఆడిటోరియంలో 7, 8 తేదీల్లో నిర్వహించే కౌన్సెలింగ్కు 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, టీసీ, ఇతర వర్సిటీ విద్యార్థులు మైగ్రేషన్ ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని సూచించారు. -
స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్: ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టేందుకుగానూ ఉన్నత విద్యా మండలి.. సంబంధిత కాలేజీలకు మార్గదర్శకాలను జారీ చేసింది. వివిధ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను, భర్తీ అయిన సీట్ల వివరాలను https://tseamcet.nic.in వెబ్సైట్లో పొందుపరిచింది. ఆయా కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. అలాగే స్పాట్ అడ్మిషన్లలో కాలేజీలు పాటించాల్సిన నిబంధనలు, ఇతర మార్గదర్శకాలను కాలేజీలకు సంబంధించిన వివరాలను https://tseamcetd.nic.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మార్గదర్శకాల ప్రకారమే యాజమాన్యాలు సీట్లను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇందులో ముందుగా కాలేజీ స్థాయిలో స్లైడింగ్కు అవకాశం ఇచ్చి ఆ తరువాత సీట్లు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రవేశాలను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.