స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ | guidelines for engineering spot addmissions | Sakshi
Sakshi News home page

స్పాట్ అడ్మిషన్లకు మార్గదర్శకాలు జారీ

Published Tue, Aug 11 2015 10:50 PM | Last Updated on Thu, Jul 11 2019 6:33 PM

guidelines for engineering spot addmissions

హైదరాబాద్: ఇంజనీరింగ్ కన్వీనర్ కోటాలో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు చేపట్టేందుకుగానూ ఉన్నత విద్యా మండలి.. సంబంధిత కాలేజీలకు మార్గదర్శకాలను  జారీ చేసింది. వివిధ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల వివరాలను, భర్తీ అయిన సీట్ల వివరాలను https://tseamcet.nic.in వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఆయా కాలేజీల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ చర్యలు చేపట్టినట్లు ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు.

అలాగే స్పాట్ అడ్మిషన్లలో కాలేజీలు పాటించాల్సిన నిబంధనలు, ఇతర మార్గదర్శకాలను కాలేజీలకు సంబంధించిన వివరాలను https://tseamcetd.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. మార్గదర్శకాల ప్రకారమే యాజమాన్యాలు సీట్లను భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఇందులో ముందుగా కాలేజీ స్థాయిలో స్లైడింగ్‌కు అవకాశం ఇచ్చి ఆ తరువాత సీట్లు భర్తీ చేయాలని పేర్కొన్నారు. ఈ ప్రవేశాలను ఈనెల 15వ తేదీలోగా పూర్తి చేయాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement