- 88 శాతం విద్యార్థుల హాజరు
- 13 కేంద్రాలలో పరీక్ష నిర్వహణ
- ఏయూ వీసీ రాజు పర్యవేక్షణ
ఏయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ఐసెట్‌కు విశాఖ రీజియన్ పరిధిలో 88 శాతం మంది హాజరయ్యారు. జిల్లాలో 6045 మంది విద్యార్థులు దరఖాస్తు చేయగా, 5330 మంది హాజరైనట్టు ప్రాం తీయ సమన్వయకర్త ఆచార్య ఎ.నరసింహారావు తెలిపారు. ఉదయం 10 నుంచి 12.30 గంటల వర కు నగరంలోని 13 కేంద్రాలలో పరీక్ష నిర్వహించా రు.
పరీక్ష సమయానికి గంట ముందుగా విద్యార్థులను కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్షలు జరుగుతున్న తీరును వర్సిటీ వీసీ జి.ఎస్.ఎన్.రాజు పరిశీలించారు. ఆయన వెంట ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆర్.సత్యరాజు, విభాగాధిపతి మధుసూదనరావు తదితరులున్నారు.
ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలోని న్యూస్ క్లాస్‌రూమ్ కాంప్లెక్స్, ఏయూ మ హిళా ఇంజినీరింగ్ కళాశాల, ఏయూ కామర్స్ మేనేజ్‌మెంట్ విభాగం, డాక్టర్ వి.ఎస్.కృష్ణా కళాశాల, బీవీకే కళాశాల, ప్రిజమ్ డిగ్రీ కళాశాల, గాయత్రి విద్యాపరిషత్ డిగ్రీ కళాశాల, డాక్టర్ లంకపల్లి బుల్లయ్య కళాశాల బ్లాక్ 2 నుంచి 7 వరకు ఏర్పాటు చేసిన కేంద్రాలలో ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదన్న నిబంధనతో ఉదయం నుంచే పెద్దసంఖ్యలో విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు.