
భానుమతి బన్‌గయా పల్లవి!
భానుమతి క్యారెక్టర్ నుంచి బయటకొచ్చేశారు సాయి పల్లవి. ‘ఫిదా’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ మలయాళీ భామ ఎప్పుడో ఆ క్యారెక్టర్ నుంచి బయటకొచ్చేశారు. మరిప్పుడు ఏం చేస్తున్నారు? అంటే... పల్లవిగా మారారామె. పల్లవి అనేది ఆమె అసలు పేరు మాత్రమే కాదు... ప్రస్తుతం తెలుగులో ఆమె నటిస్తున్న సినిమాలో పేరు కూడా! ఇప్పుడా సిన్మాలోని క్యారెక్టర్‌లోకి వెళ్లారామె.
నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్న ‘ఎం.సి.ఎ.’లో ప్రేక్షకులకు పల్లవిగా కనిపించనున్నారు సాయి పల్లవి. ‘ఎం.సి.ఎ.’ అంటే హీరో నాని, దర్శకుడు వేణు శ్రీరామ్‌లు ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ అని చెబుతుంటే... సాయి పల్లవి మాత్రం వేరే అర్థం చెబుతున్నారు. ‘ఎం.సి.ఎ.’ అంటే ‘మిడిల్ క్లాస్ అమ్మాయి’ అంటున్నారు. అసలు మేటర్ ఏంటంటే... ఇందులో ఆమె సాధారణ మధ్య తరగతి అమ్మాయిగా నటిస్తున్నారు. భానుమతి తరహాలో ఈ పల్లవి పాత్ర కూడా చాలా సహజంగా ఉంటుందట!