హాజరుకానున్న 2,963 మంది విద్యార్థులు
జిల్లా కేంద్రంలో 5, కోదాడలో ఒక సెంటర్
బయోమెట్రిక్ అమలు..
నల్లగొండ రూరల్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ పరీక్ష గురువారం జరుగనుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి అర్హత పరీక్షను బయోమెట్రిక్ విధానం ద్వారా అమలు చేస్తున్నారు. ఈ పరీక్షకు మొత్తం 2,963 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఐసెట్ రీజినల్ కోఆర్డినేటర్ అల్వాల రవి, ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ నాగేందర్‌రెడ్డి, కోదాడ రీజియన్ కోఆర్డినేటర్ ఎ.శంకర్ బుధవారం కేంద్రాలను పరిశీలించి ఏర్పాట్లను పూర్తి చేయించారు. ఒక్క నిమిషం నిబంధన ఉండడంతో విద్యార్థులు ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగనుంది.
జిల్లా కేంద్రంలో 5 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా కోదాడలో ఒక పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. నల్లగొండలో అన్నెపర్తిలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో మూడు కేంద్రాలను, ఎన్జీ కాలేజీ, ఉమెన్స్ డిగ్రీ కాలేజీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో 2,397 మంది విద్యార్థులు, కోదాడలోని కేఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సెంటర్‌లో 566 మంది పరీక్ష రాయనున్నారు. 250 మందికి ఒక బయోమెట్రిక్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలకు ఆరుగురు చీఫ్ సూపరింటెండెంట్లను నియమించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు హాల్‌టికెట్‌తో పాటు ఆన్‌లైన్ దరఖాస్తు ఫారంపై ఫొటో అతికించి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి వెంట తెచ్చుకోవాలి. ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించరు.
నేడే టీఎస్ ఐసెట్
Published Thu, May 19 2016 12:42 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
Advertisement
Advertisement