ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు
హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఐసెట్ -2014ను ఈ నెల 23న నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ బుధవారం వెల్లడించారు. ఐసెట్‌కు 1,42,464 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను www.apicet.org.in వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, నిర్ణీత సమయూనికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్‌నే వినియోగించాలని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, పేజర్లు, క్యాలికులేటర్లు, ఇయర్‌ఫోన్స్ లాంటివి తీసుకురావద్దన్నారు.
రేపు ఐసెట్-2014
Published Thu, May 22 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 AM
Advertisement