ICET-2014
-
ఐసెట్ -2014 ఫలితాల విడుదల
* 92.45 శాతం మంది ఉత్తీర్ణత * జూన్ 17 నుంచి ర్యాంకు కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చు హన్మకొండ, న్యూస్‌లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 23న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ -2014 పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఐసెట్ చైర్మన్, కేయూ ఇన్చార్జి వీసీ ఆర్ఎం.డోబ్రియాల్, ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్‌లు ఫలితాలను ప్రకటించారు. ఐసెట్-2014 పరీక్షకు 1,42,462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 1,29,529 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఇందులో 1,19,756 మంది అభ్యర్థులు (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. పురుషులు 83,868 మంది పరీక్షకు హాజరు కాగా... 77,211 మంది(92.06 శాతం) మహిళలు 45,661 మంది పరీక్షకు హాజరుకాగా.. 42,545 మంది (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 263 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్‌ను ప్రశాంతంగా నిర్వహించారన్నారు. పరీక్ష ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేశామన్నారు. ఫైనల్ కీ www,apicet.org.inవెబ్సైట్లో అందుబాటులో ఉందన్నారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను ఈ నెల 17వ తేదీ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చునని వివరించారు. రీ కౌంటింగ్ ఆప్మార్క్స్, ఫొటోస్టాట్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్షీట్ కోసం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కన్వీనర్ ఐసెట్-2014 పేర డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాలని అభ్యర్థులకు సూచించారు. బెస్ట్ కంపెనీలో మేనేజర్ కావాలని ఉంది ఐసెట్ ఫలితాల్లో 181 మార్కులతో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ పూర్తిచేశాను. మంచి కంపెనీలో మేనేజర్ కావాలనేదే లక్ష్యం. దీంతో ఐసెట్‌కు ప్రిపేరయ్యాను. కేరళలోని కోయికుడ్ లేదా జంషెడ్‌పూర్‌లో ఎంబీఏ కోర్సు చదువుకోవాలని ఉంది. ఇప్పటికే క్యాట్ పరీక్షను కూడా రాసి.. అందులో ప్రతిభ చూపాను. - అనుభవ్ కున్నేల్ ప్రేమ్, ఐసెట్ మొదటి ర్యాంకర్ -
సజావుగా ఐసెట్
ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఐసెట్-2014 జిల్లాలో సజావుగా ముగిసింది. జిల్లా నుంచి 1551 మంది దరఖాస్తు చేసుకోగా 1370 మంది(88.33 శాతం) హాజరయ్యా రు. శ్రీకాకుళంలోని నాలుగు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 500 మందికి 439 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 551 మందికి 478 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో 300 మందికి 274 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో 200 మందికి 179 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలకురాలు ప్రొఫెసర్ అనిత, జిల్లా ఐసెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, పరిశీలకులు డాక్టర్ కూన అచ్యుతరావు, డాక్టర్ సంతోష్ రంగనాథ్‌లు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష జరిగిన తీరును పరిశీలించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు బమ్మిడి పోలీస్, కె.మైథిలి, పాలిటెక్నిక్‌ల విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, సత్యనారాయణలు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు. -
రేపు ఐసెట్-2014
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఐసెట్ -2014ను ఈ నెల 23న నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ బుధవారం వెల్లడించారు. ఐసెట్‌కు 1,42,464 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను www.apicet.org.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, నిర్ణీత సమయూనికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నే వినియోగించాలని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, పేజర్లు, క్యాలికులేటర్లు, ఇయర్‌ఫోన్స్ లాంటివి తీసుకురావద్దన్నారు. -
ఐసెట్ 2014 గ్రాండ్ టెస్ట్
ICET-2014 Grand Test -
ఐసెట్‌కు 1,39,894 దరఖాస్తులు: కన్వీనర్
హన్మకొండ, న్యూస్‌లైన్: ఐసెట్-2014కు ఇప్పటి వరకు 1,39,894 దరఖాస్తులు వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసెట్-2014 దరఖాస్తులకు శుక్రవారం సాయంత్రానికి గడువు ముగిసినా, రూ.500 రుసుముతో 15వ తేదీ వరకు, రూ.2వేల రుసుముతో 25వ తేదీ వరకు, రూ.5వేల రుసుముతో మే 6వతేదీ వరకు, రూ.10 వేల రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఇక నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ నెల 21నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు.