ఎచ్చెర్ల క్యాంపస్, న్యూస్‌లైన్ : రాష్ట్రంలోని ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన ఐసెట్-2014 జిల్లాలో సజావుగా ముగిసింది. జిల్లా నుంచి 1551 మంది దరఖాస్తు చేసుకోగా 1370 మంది(88.33 శాతం) హాజరయ్యా రు. శ్రీకాకుళంలోని నాలుగు కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. కొంచెం ఆలస్యంగా వచ్చిన విద్యార్థులు నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది.
శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల కేంద్రంలో 500 మందికి 439 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల ప్రభుత్వ డిగ్రీ కళాశాల కేంద్రంలో 551 మందికి 478 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాలలో 300 మందికి 274 మంది, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళల పాలిటెక్నిక్ కళాశాలలో 200 మందికి 179 మంది విద్యార్థులు పరీక్ష రాశారు.
నాగార్జున యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రత్యేక పరిశీలకురాలు ప్రొఫెసర్ అనిత, జిల్లా ఐసెట్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ తమ్మినేని కామరాజు, పరిశీలకులు డాక్టర్ కూన అచ్యుతరావు, డాక్టర్ సంతోష్ రంగనాథ్‌లు పరీక్ష కేంద్రాలను సందర్శించారు. పరీక్ష జరిగిన తీరును పరిశీలించారు. డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు బమ్మిడి పోలీస్, కె.మైథిలి, పాలిటెక్నిక్‌ల విభాగాధిపతులు మేజర్ కె.శివకుమార్, సత్యనారాయణలు పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లుగా వ్యవహరించారు.
సజావుగా ఐసెట్
Published Sat, May 24 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM
Advertisement
Advertisement