* 92.45 శాతం మంది ఉత్తీర్ణత
* జూన్ 17 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
హన్మకొండ, న్యూస్‌లైన్ : ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ ఏడాది మే 23న కాకతీయ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెట్ -2014 పరీక్ష ఫలితాలను సోమవారం విడుదల చేశారు. ఐసెట్ చైర్మన్, కేయూ ఇన్‌చార్జి వీసీ ఆర్‌ఎం.డోబ్రియాల్, ఐసెట్ కన్వీనర్, కేయూ ప్రొఫెసర్ ఓంప్రకాశ్‌లు ఫలితాలను ప్రకటించారు. ఐసెట్-2014 పరీక్షకు 1,42,462 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా... 1,29,529 మంది హాజరైనట్లు వెల్లడించారు. ఇందులో 1,19,756 మంది అభ్యర్థులు (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించారన్నారు. పురుషులు 83,868 మంది పరీక్షకు హాజరు కాగా... 77,211 మంది(92.06 శాతం) మహిళలు 45,661 మంది పరీక్షకు హాజరుకాగా.. 42,545 మంది (92.45 శాతం) ఉత్తీర్ణత సాధించినట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 263 పరీక్ష కేంద్రాల్లో ఐసెట్‌ను ప్రశాంతంగా నిర్వహించారన్నారు. పరీక్ష ఫలితాలతోపాటు ఫైనల్ కీని కూడా విడుదల చేశామన్నారు.
ఫైనల్ కీ www,apicet.org.inవెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. అభ్యర్థులు తమ ర్యాంకు కార్డులను ఈ నెల 17వ తేదీ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చునని వివరించారు. రీ కౌంటింగ్ ఆప్‌మార్క్స్, ఫొటోస్టాట్ కాపీ ఆఫ్ ఓఎంఆర్ ఆన్సర్‌షీట్ కోసం ఈ నెల 24వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు కన్వీనర్ ఐసెట్-2014 పేర డిమాండ్ డ్రాఫ్ట్ పంపించాలని అభ్యర్థులకు సూచించారు.
బెస్ట్ కంపెనీలో మేనేజర్ కావాలని ఉంది
ఐసెట్ ఫలితాల్లో 181 మార్కులతో మొదటి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. నేను ఇప్పటికే బీటెక్ పూర్తిచేశాను. మంచి కంపెనీలో మేనేజర్ కావాలనేదే లక్ష్యం. దీంతో ఐసెట్‌కు ప్రిపేరయ్యాను. కేరళలోని కోయికుడ్ లేదా జంషెడ్పూర్‌లో ఎంబీఏ కోర్సు చదువుకోవాలని ఉంది. ఇప్పటికే క్యాట్ పరీక్షను కూడా రాసి.. అందులో ప్రతిభ చూపాను. - అనుభవ్ కున్నేల్ ప్రేమ్, ఐసెట్ మొదటి ర్యాంకర్
ఐసెట్ -2014 ఫలితాల విడుదల
Published Tue, Jun 10 2014 2:07 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM
Advertisement
Advertisement