రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ విద్యాసంవత్సరంలో (2014-2015)ఐసెట్ -2014కు ఇప్పటివరకు 1,44,436 దరఖాస్తులు వచ్చాయని ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం తెలిపారు.
500 రుసుముతో నేటి వరకు గడువు
హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ విద్యాసంవత్సరంలో (2014-2015)ఐసెట్ -2014కు ఇప్పటివరకు 1,44,436 దరఖాస్తులు వచ్చాయని ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు మంగళవారంతో ముగియనుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఇంకా దరఖాస్తులను అప్‌లోడు చేయని విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15వరకు అప్‌లోడుచేసుకోవాలన్నారు. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 25వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 6వ తేదీవరకు, రూ 10 వేల అపరాధ రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓంప్రకాష్ తెలిపారు.