Om prakash
-
ప్రభాస్ పాత్రలో సూర్య..?
-
మెగా ఫోన్ పట్టనున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్.. ఆ స్టార్ హీరోతోనే!
సినిమా చాలా పాఠాలు నేర్పుతుంది. అందులో మంచి, చెడు రెండు ఉంటాయి. ఇక సినిమా ద్వారా చాలా నేర్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్ ఒకరు. ఆయన తమిళంలో కళవాణి, నాణయం, అనేగన్, మారి, నీదానే ఎన్ పొన్వసంతం, తిరుచిట్రఫలం తదితర చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రహకుడిగా రాణిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషా చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఓం ప్రకాశ్ సుమారు 500 చిత్రాలకు పైగా పని చేశారు. తాజాగా ఓం ప్రకాశ్ మెగాఫోన్ పట్డడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ హీరోగా ఓ చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నారని సమాచారం. మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు హీరో ధనుశ్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనే తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 50వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ధనుష్ తన సోదరి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నిలావుక్కు ఏన్ ఎన్మేల్ కోపం అనే చిత్రాన్ని స్వీయ దర్శక్వంలో నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత ఓం ప్రకాశ్ దర్శకత్వంలో చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. -
శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించిన లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా
-
కరోనాతోనే మొద్దు శ్రీను హంతకుడు మృతి
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓం ప్రకాశ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. యన మృతదేహానికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. (మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి) -
మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి
చిత్తూరు అర్బన్/ములకలచెరువు/దొండపర్తి (విశాఖ దక్షిణ): టీడీపీ నేత పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడు మొద్దుశీనును హత్య చేసిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న మదనపల్లె ఓంప్రకాశ్ ఆదివారం తెల్లవారుజామున విశాఖలోని కేజీహెచ్‌లో మృతి చెందాడు. మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్న ఓంప్రకాశ్.. శనివారం రాత్రి అనారోగ్య సమస్య రావడంతో విశాఖ సెంట్రల్ జైలు అధికారులు అతడిని కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్య, జైలు అధికారులు ప్రకటించారు. ► ఓంప్రకాశ్ మదనపల్లెకు చెందిన వ్యక్తి. 2001లో ఓ లారీని చోరీ చేసి అడ్డొచ్చిన డ్రైవర్‌ను హత్య చేశాడు. ► ఈ కేసులో పుంగనూరు పోలీసులు ఓంప్రకాశ్‌ను అరెస్టు చేసి కోర్టుకు తరలించగా, నేరం రుజువుకావడంతో శిక్ష పడింది. ► అనంతపురం జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఓంప్రకాశ్ 2008 నవంబర్ 9న పరిటాల రవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న మొద్దుశీనును జైల్లోనే డంబెల్‌తో కొట్టి హత్యచేసి వార్తల్లోకెక్కాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవితఖైదు విధించింది. విశాఖ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. -
మొద్దు శ్రీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి
సాక్షి, అనంతపురం : మొద్దు శ్రీను హత్యకేసులో నిందితుడైన ఓం ప్రకాశ్ అనారోగ్యంతో మృతి చెందాడు. కిడ్నీ సంబంధిత వ్యాధితో గతకొంత కాలంగా బాధపడుతున్న ఆయన.. సోమవారం విశాఖపట్నం కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును 2008 నవంబర్ 9న జైలులోనే డంబుల్తో కొట్టి హత్య చేశాడు. ఈ కేసులో అనంతపురం ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఓంప్రకాశ్‌కు జీవిత ఖైదు విధించింది. 2016 నుంచి విశాఖ సెంట్రల్ జైలులో ఓం ప్రకాశ్ శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే కొంతకాలం నుంచి అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ.. సోమవారం మధ్యాహ్నం మృతి చెందాడు. ఓం ప్రకాష్ మరణవార్త తెలిసిన అతని కుటుంబ సభ్యులు విశాఖ చేరుకున్నారు. అతని తనయుడు సాయి కుమార్ తన తండ్రి ఇంకో కొంత కాలం జీవిస్తారని అనుకున్నానని ఊహించని రీతిలో మృత్యువాత పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కోవిడ్ పరీక్షలో నెగిటివ్ వస్తే సొంత ఊరు తీసుకుని వెళ్తామని అతని తనయుడు సాయి కుమార్ తెలిపారు. ఓం ప్రకాశ్ తల్లి సరోజనమ్మ కూడా అనారోగ్యంతో గత ఏప్రిల్ మృతిలో మృతిచెందారు. -
చావుకోరిన ప్రేమ
లోకం పోకడ తెలియని రెండు హృదయాలు ప్రేమనో.. ఆకర్షణో.. వీడలేనంత దగ్గరయ్యాయి కన్నవాళ్లు.. కులం.. కట్టుబాట్లు.. అడ్డుతగిలాయి ఆ పసి మనసులు విలవిల్లాడిపోయాయి ఎడబాటును తట్టుకోలేకపోయాయి వీడిపోలేక.. వీడి ఉండలేక... చావులో ఒక్కటవుదామనుకున్నారు భవిష్యత్ తలచుకుని భయాందోళన చెందారు పురుగుల మందునే ప్రేమామృతంగా తాగారుఆస్పత్రికి తీసుకెళ్లినా ఒకరి తర్వాత మరొకరు తనువు చాలించారుశృతి తప్పిన ప్రేమ ప్రకాశించకపోగాకన్నవారికి కడుపుకోత మిగిలింది. బత్తలపల్లి: తమ వివాహానికి కులాలు అడ్డు వస్తుండడంతో మనస్తాపం చెందిన ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ధర్మవరం రూరల్ సీఐ వీసీ పెద్దయ్య తెలిపిన మేరకు.. బత్తలపల్లి మండలం యర్రాయపల్లికి చెందిన గొడ్డుమర్రి చిన్నపోతులయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు ఓంప్రకాష్(18), అదే గ్రామానికి చెందిన మనోహర్, సావిత్రి దంపతుల కుమార్తె శ్రుతి(18).. ధర్మవరంలోని ఓ కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నారు. కళాశాలకు వెళ్లి వచ్చే క్రమంలో వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ వ్యవహారం ఇటీవల తల్లిదండ్రులకు తెలిసి కులాలు వేరుకావడంతో పెళ్లి చేయడం కుదరదని, ఈ విషయాన్ని ఇంతటితో వదులుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్తాపం చెందిన ఇద్దరూ ఆత్మహత్య చేసుకోవాలని భావించారు. బుధవారం వేకువజామున 5.30 గంటలకు యువకుడి తోటలో ఇద్దరూ కలిసి పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నారు. ఆరు గంటలకు యువకుడి సమీప బంధువులు తోటలో బెండకాయలు కోయడానికి వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే ఇరువైపుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని ఇద్దరినీ అనంతపురంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ముందు యువకుడు.. ఆ తర్వాత యువతి మృతి చెందారు. ఘటనపై ధర్మవరం రూరల్ సీఐ పెద్దయ్య కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
హిట్ సినిమాల రూపకర్త..
‘జై జై శివశంకర్’... అనే పాట రేడియోలో రోజూ వస్తుంటుంది. ‘తుమ్ ఆగయే హో నూర్ ఆగయా హై’ పాట కూడా ఎప్పుడూ వినపడుతుంటుంది. ‘షీషా హో యా దిల్ హో టూట్ జాతా హై’ చాలా పెద్ద హిట్. ఈ పాటలన్నీ ఉన్న సినిమాల సూత్రధారి, రూపకర్త జె. ఓంప్రకాష్ బుధవారం ముంబైలో మృతి చెందారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. మొదట నిర్మాతగా, ఆ తర్వాత దర్శకుడిగా జె. ఓంప్రకాష్ హిందీ ఇండస్ట్రీలో అరవయ్యవ దశకం నుంచి యనభయ్యవ దశకం వరకు మూడు దశాబ్దాలపాటు చక్రం తిప్పారు. తన సినిమా టైటిల్స్ ‘ఏ’ అక్షరంతో మొదలయ్యే సెంటిమెంట్‌ను పాటించిన ఓంప్రకాష్ ‘ఆయే మిలన్ కి బేలా’, ‘ఆయా సావన్ ఝూమ్ కే’, ‘ఆంఖో ఆంఖోమే’ సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఆ తర్వాత రాజేష్ ఖన్నా, ముంతాజ్‌లతో ‘ఆప్ కీ కసమ్’ సినిమాతో డైరెక్టర్‌గా మారారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇందులోని ‘జై జై శివశంకర్’, ‘జిందకీ కే సఫర్ మే’ పాటలు చాలా హిట్. ఈ సినిమాను తెలుగులో దాసరి నారాయణరావు దర్శకత్వంలో మోహన్‌బాబు హీరోగా ‘ఏడడుగుల బంధం’గా రీమేక్ చేశారు. ఆ తర్వాత రీనా రాయ్, జితేంద్రలతో ‘ఆశా’ సినిమాను తీశారు. ఇందులోని ‘షీషా హో యా దిల్ హో’ పాట, ‘ఆద్మీ ముసాఫిర్ హై’ పాటలు హిట్ అయ్యాయి. ఎన్.టి.ఆర్ హీరోగా ఇదే సినిమాను ‘అనురాగదేవత’గా రీమేక్ తీస్తే పెద్ద హిట్ అయ్యింది. తమిళంలో కూడా ఇదే సినిమా రీమేక్ చేశారు. గుల్జార్ దర్శకత్వంలో తీసిన ‘ఆంధీ’ ఆ రోజుల్లో సంచలనమే సృష్టించింది. ఇందులోని పాటలూ హిట్టే. తన కుమార్తె పింకీని రాకేష్ రోషన్‌కు ఇచ్చి పెళ్లి చేయడం ద్వారా జె. ఓంప్రకాష్ సంగీత దర్శకుడు రోషన్‌కు వియ్యంకుడయ్యారు. హృతిక్ రోషన్‌కు తాతయ్యారు. జె. ఓంప్రకాష్ మరణవార్త విని అమితాబ్, ధర్మేంద్ర వంటి బాలీవుడ్ దిగ్గజాలు తరలి వచ్చి నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు బుధవారం రోజునే ముంబైలో ముగిశాయి. -
బాలుడిని బలిగొన్న మంత్రి కాన్వాయ్
లక్నో: యూపీలోని గోండా జిల్లాలో ఆ రాష్ట్ర మంత్రి ఓం ప్రకాశ్ రాజ్‌భర్ వాహనశ్రేణి ఢీకొని రోడ్డు పక్కన ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు శనివారం మరణించాడు. బాలుడిని కారుతో గుద్దిన తర్వాత కనీసం పిల్లాడికి ఏమైందో చూడటానికి కూడా ఆపకుండా వాహనశ్రేణి వెళ్లిపోయింది. బాధిత కుటుంబానికి సీఎం యోగి రూ.5 లక్షల పరిహారం ప్రకటించడంతోపాటు ఘటనపై నివేదిక ఇవ్వాలని పోలీసులను కోరారు. సంఘటన జరిగినప్పుడు తాను ఆ కార్లలో లేనని రాజ్‌భర్ చెబుతుండగా, అది అబద్ధమని స్థానికులు వాదిస్తున్నారు. మంత్రిపై ప్రతిపక్ష సమాజ్‌వాదీ, బహుజన సమాజ్, కాంగ్రెస్ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. రాజ్‌భర్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. -
విజృంభించిన ఓంప్రకాశ్
విజయ్ సీసీ గెలుపు ఎ-డివిజన్ వన్డే లీగ్ హైదరాబాద్: ఓంప్రకాశ్ (5/14) బెంబేలెత్తించడంతో విజయ్ సీసీ 8 వికెట్ల తేడాతో విజయానంద్ సీసీపై ఘనవిజయం సాధించిం ది. ఎ-డివిజన్ వన్డే లీగ్‌లో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేపట్టిన విజయానంద్ సీసీ 24 ఓవర్లలో 51 పరుగులకే కుప్పకూలింది. ఓంప్రకాశ్, బాబు (3/14) ధాటికి ఎవరూ నిలువలేకపోయారు. తర్వాత విజయ్ సీసీ 2 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసి గెలిచింది. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు గోల్కొండ సీసీ: 225 (వరుణ్ 57), మహబూబ్ సీసీ: 107 (కిరణ్ 48; లోహిత్ 3/22, శుభమ్ 4/17). యూనివర్సల్: 155 (గౌరి శంకర్ 40, సాత్విక్ 37), యూనివర్సల్ సీసీ: 156/7 (జావిద్ 30, సాయి యశ్వంత్ 31; గౌరిశంకర్ 3/26). లక్కీ ఎలెవన్: 135 (రాహుల్ 42; దశరథ్ 6/21), అంతర్జాతీయ సీసీ: 122 (నిస్సార్ 30, మనో సాత్విక్ 30). ఇంపీరియల్ సీసీ: 105 (ఇర్ఫాన్ 53; సాయిసచిత్ 4/27), సన్‌గ్రేస్: 103/2 (ప్రవీణ్ సాగర్ 59 నాటౌట్, యశ్ అగర్వాల్ 30 నాటౌట్). -
ప్రైవేటు కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి: ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రంగారెడ్డి జిల్లా బాచుపల్లిలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఆదివారం రాత్రి జరిగింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓంప్రకాశ్ (17) అనే విద్యార్థి హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం ఉదయం గుర్తించిన తోటి స్నేహితులు, కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు. -
నూతన డీజీపీగా ఓం ప్రకాష్ !
నేడు అధికారిక ప్రకటన నలుగురు అధికారుల పేర్లను సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీ బెంగళూరు : నూతన డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం హోంగార్డ్స్, అగ్నిమాపక శాఖకు డీజీపీ-ఐజీపీగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత డీజీపీ లాల్‌రుఖుమ్ పచావో పదవీకాలం నేటి(శనివారం)తో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త పోలీస్ బాస్ ఎంపికకు సంబంధించిన అధికారిక ప్రకటన సైతం శనివారం వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక డీజీపీ రేస్‌లో సీనియర్ ఐపీఎస్ అధికారులు రూప్ కుమార్ దత్త, సుశాంత్ మహాపాత్ర, ఓం ప్రకాష్ ల మధ్య గట్టి పోటీనే ఏర్పడింది. వీరిలో సీబీఐ స్పెషల్ డెరైక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రూప్‌కుమార్ దత్తను కొత్త పోలీస్ బాస్‌గా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సైతం మొగ్గు చూపింది. అంతేకాక ముఖ్యమంత్రి అధ్యక్షతన, రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్, సీనియర్ పోలీసు అధికారులతో నిర్వహించిన సమావేశంలోనూ ఎక్కువ మంది పోలీసు అధికారులు డీజీపీ పదవికి రూప్‌కుమార్ దత్త పేరునే సూచించారు. అయితే అనంతరం అనూహ్యంగా ఓం ప్రకాష్ సైతం డీజీపీ రేస్‌లో ముందంజలోకి వచ్చారు. ప్రస్తుతం డీజీపీ పదవికి గాను ఓం ప్రకాష్ పేరే వినిపిస్తోంది. డీజీపీగా ఓం ప్రకాష్‌ను నియమిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటన చేయడం మాత్రమే మిగిలి ఉంది. కాగా ఐపీఎస్ అధికారి ఓం ప్రకాష్‌కు నిజాయితీ గల అధికారిగా పోలీసు వర్గాల్లో పేరుంది. స్వతహాగా బీహార్‌కు చెందిన ఓం ప్రకాష్ 1981లో ఐపీఎస్ పూర్తిచేసి కర్ణాటక కేడర్‌లో స్థిరపడ్డారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వర్తించిన ఓం ప్రకాష్ అనేక విపత్కర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొని, సమస్యలను పరిష్కరించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. నలుగురు అధికారుల పేర్లు సిఫార్సు..... ఇక నూతన డీజీపీ నియామకానికి సంబంధించి రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కౌశిక్ ముఖర్జీతో పాటు సీనియర్ పోలీసు అధికారులతో కూడిన ఉన్నత స్థాయి సమితి శుక్రవారమిక్కడి విధానసౌధలో సమావేశమైంది. డీజీపీ రేస్‌లో ఉన్న అధికారుల శక్తి, సామర్థ్యాలు, వారి సీనియారిటీ తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న సమితి మొత్తం నలుగురు ఐపీఎస్ అధికారులను డీజీపీ నియామకానికి గాను సిఫార్సు చేసింది. వీరిలో ఓం ప్రకాష్, రూప్‌కుమార్ దత్త, సుశాంత్ మహాపాత్ర, బిపిన్ గోపాలకృష్ణలు ఉన్నారు. ఈ సమావేశం అనంతరం రాష్ట్ర హోం శాఖ మంత్రి కె.జె.జార్జ్ మాట్లాడుతూ....డీజీపీ నియామకానికి సంబంధించి మొత్తం నలుగురు అధికారుల పేర్లను సిఫార్సు చేశామని తెలిపారు. ఇందుకు సంబంధించిన నివేదికను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు పంపుతున్నామని, ఈ నలుగురిలో ఒకరిని డీజీపీగా నియమిస్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. -
రేపు ఐసెట్-2014
ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్రవ్యాప్తంగా ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు గాను ఐసెట్ -2014ను ఈ నెల 23న నిర్వహించనున్నామని, అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఐసెట్ కన్వీనర్, కాకతీయ వర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ బుధవారం వెల్లడించారు. ఐసెట్‌కు 1,42,464 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని చెప్పారు. అభ్యర్థులు హాల్‌టికెట్లను www.apicet.org.in వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. పరీక్ష శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అభ్యర్థులు గంట ముందు పరీక్షా కేంద్రాల్లోకి చేరుకోవాలని, నిర్ణీత సమయూనికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమన్నారు. బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్నే వినియోగించాలని ఎలక్ట్రానిక్ పరికరాలు, మొబైల్స్, పేజర్లు, క్యాలికులేటర్లు, ఇయర్‌ఫోన్స్ లాంటివి తీసుకురావద్దన్నారు. -
ఐసెట్‌కు 1,44,436 దరఖాస్తులు
500 రుసుముతో నేటి వరకు గడువు హన్మకొండ, న్యూస్‌లైన్: రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకుగాను ఈ విద్యాసంవత్సరంలో (2014-2015)ఐసెట్ -2014కు ఇప్పటివరకు 1,44,436 దరఖాస్తులు వచ్చాయని ఐసెట్ కన్వీనర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ సోమవారం తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకునేందుకు చివరి గడువు మంగళవారంతో ముగియనుందని చెప్పారు. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి ఇంకా దరఖాస్తులను అప్లోడు చేయని విద్యార్థులు రూ.500 అపరాధ రుసుముతో ఈనెల 15వరకు అప్లోడుచేసుకోవాలన్నారు. రూ.2,000 అపరాధ రుసుముతో ఈ నెల 25వరకు, రూ.5,000 అపరాధ రుసుముతో మే 6వ తేదీవరకు, రూ 10 వేల అపరాధ రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఓంప్రకాష్ తెలిపారు. -
ఐసెట్‌కు 1,39,894 దరఖాస్తులు: కన్వీనర్
హన్మకొండ, న్యూస్‌లైన్: ఐసెట్-2014కు ఇప్పటి వరకు 1,39,894 దరఖాస్తులు వచ్చినట్లు ఐసెట్ కన్వీనర్, ప్రొఫెసర్ ఓం ప్రకాశ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విద్యాసంవత్సరంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల కోసం ఈ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసెట్-2014 దరఖాస్తులకు శుక్రవారం సాయంత్రానికి గడువు ముగిసినా, రూ.500 రుసుముతో 15వ తేదీ వరకు, రూ.2వేల రుసుముతో 25వ తేదీ వరకు, రూ.5వేల రుసుముతో మే 6వతేదీ వరకు, రూ.10 వేల రుసుముతో మే19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అయితే ఇక నుంచి ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుం దని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 250 కేంద్రాల్లో మే 23న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించబోతున్నామని చెప్పారు. ఈ నెల 21నుంచి అభ్యర్థులు తమ హాల్‌టికెట్లను వెబ్సైట్ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని ఆయన వివరించారు. -
ఎర్రగడ్డ ఆస్పత్రి నుంచి ఖైదీల పరారీ
సాక్షి, హైదరాబాద్: భార్యను ములాఖత్‌కు అనుమతించలేదన్న కోపంతో ఓ అండర్ ట్రయల్ ఖైదీ వేసిన పథకంతో ఆస్పత్రి నుంచి చికిత్స పొందుతున్న పదకొండుమంది పరారయ్యారు. రెడ్ అలర్ట్ ప్రకటించిన పోలీసులు మంగళవారం సాయంత్రానికి ఎనిమిది మందిని పట్టుకోగా... మరో ముగ్గురు ముంబైలో ఉన్నట్లు ఆధారాలు సేకరించారు. వీరికోసం వేట ముమ్మరం చేశారు. సోమవారం రాత్రి 9.30-12.30 మధ్య జరిగిన ఈ ఘటన వివరాలివి... నాంపల్లిలోని ఛాపెల్ రోడ్ ఫాహుద్దీన్ ఖురేషీ (38)పై అబిడ్స్, నాంపల్లి ఠాణాల్లో వరకట్న వేధింపుల కేసుతో పాటు మాదకద్రవ్యాలు కలిగిన తదితర కేసులు నమోదై ఉన్నాయి. ఫలితంగా చంచల్‌గూడ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా ఉన్నాడు. ఇతడి మానసిక పరిస్థితి బాలేకపోవడంతో జైలు అధికారులు ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో ఉంచి చికిత్స చేయిస్తున్నారు. సోమవారం రాత్రి 9.30 గంటల సమయంలో ఖురేషీ రెండో భార్య అతడిని కలిసేందుకు రాగా ఆర్ఎంఓ ఓంప్రకాష్ అనుమతించలేదు. దీంతో ఖురేషీ దాదాపు రెండు గంటల పాటు ప్రిజనల్ వార్డులో హంగామా సృష్టించాడు. వార్డు కబోర్డులో ఉన్న తోటి రోగుల కేస్షీట్లను తీసుకుని అగ్గిపెట్టెతో వాటికి నిప్పుపెట్టాడు. దీనివల్ల తీవ్రంగా పొగ రావడంతో ఆందోళన చెందిన సిబ్బంది వార్డులో ఉన్న 50 మంది రోగులను పక్కవార్డుకు మార్చారు. ఈ హడావిడిలో అక్కడే ఉన్న ఆక్సిజన్ సిలిండర్‌తో గోడకు రంధ్రం చేసి ఖురేషీ మరో పదిమంది ఖైదీలతో పారిపోయాడు. ప్రిజనల్ వార్డుకు అనుకుని ఉన్న క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న మాజీ ఉద్యోగులు ప్రశ్నించగా కత్తితో బెదిరించాడు. దీంతో భయపడిన వారు 11మంది ఖైదీలు వెళ్లిపోయాక ఆస్పత్రి అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రి అధికారుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ‘రెడ్ అలర్ట్’ ప్రకటించి ఎనిమిదిమందిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన పట్టుకునేందుకు మూడు ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేశామని పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు. ఖురేషీ టవేరా కారు (ఏపీ09 బిసి 7909)లో రెండో భార్యతో ముంబై పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మిగిలిన వారూ వీరితో పాటే ఉండవచ్చన్న అనుమానాలున్నాయి. ఖైదీలు పారిపోవడం వెనుక ఆస్పత్రి సిబ్బంది ప్రమేయం, నిర్లక్ష్యం ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న ముగ్గురికీ ఘనమైన నేరచరిత్ర ఉందనీ, వారు సామాన్యులపై దాడులకు పాల్పడే అవకాశం కూడా ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.