
సాక్షి, విశాఖపట్నం : విశాఖ సెంట్రల్ జైల్లో కరోనా వైరస్ కలకలం రేపింది. కారాగారంలోని 10 మంది సిబ్బంది, 27 మంది జీవితఖైదీలకు తాజాగా నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌గా తేలింది. మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొద్దు శ్రీనును హత్య చేసి ఓం ప్రకాశ్‌కు కూడా పాజిటివ్‌గా తేలింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఓం ప్రకాశ్ ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. యన మృతదేహానికి కరోనా టెస్ట్ నిర్వహించగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మరోవైపు పాజిటివ్‌గా తేలిన ఖైదీలను వైద్యుల సూచనల మేరకు క్వారెంటైన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. మరికొంతమంది రిమాండ్ ఖైదీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. (మొద్దు శీను హత్య కేసు నిందితుడి మృతి)
Comments
Please login to add a commentAdd a comment