మెగా ఫోన్ పట్టనున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్.. ఆ స్టార్ హీరోతోనే! | Dhanush Set To Play The Lead In Cinematographer Om Prakash Directorial Debut?- Sakshi
Sakshi News home page

Om Prakash: మెగా ఫోన్ పట్టనున్న ఓం ప్రకాశ్.. ఆ స్టార్ హీరోతోనే!

Published Tue, Mar 26 2024 4:08 PM | Last Updated on Tue, Mar 26 2024 4:25 PM

Famous Cinematographer Om Prakash Ready Take Mega Phone - Sakshi

సినిమా చాలా పాఠాలు నేర్పుతుంది. అందులో మంచి, చెడు రెండు ఉంటాయి. ఇక సినిమా ద్వారా చాలా నేర్చుకున్నవారూ ఉన్నారు. అలాంటి వారిలో సినిమాటోగ్రాఫర్ ఓం ప్రకాశ్‌ ఒకరు. ఆయన తమిళంలో కళవాణి, నాణయం, అనేగన్‌, మారి, నీదానే ఎన్‌ పొన్‌వసంతం, తిరుచిట్రఫలం తదితర చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. తమిళ చిత్ర పరిశ్రమలో ప్రముఖ ఛాయాగ్రహకుడిగా రాణిస్తున్నారు.

తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం భాషా చిత్రాలకు ఛాయాగ్రహకుడిగా పని చేశారు. దాదాపు 15 ఏళ్లుగా కొనసాగుతున్న ఓం ప్రకాశ్ సుమారు 500 చిత్రాలకు పైగా పని చేశారు. తాజాగా ఓం ప్రకాశ్‌ మెగాఫోన్‌ పట్డడానికి సిద్ధమవుతున్నట్లు తెలిసింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్ హీరోగా ఓ చిత్రాన్ని డైరెక్ట్‌ చేయబోతున్నారని సమాచారం. 

మరో విశేషం ఏంటంటే ఈ సినిమాకు హీరో ధనుశ్ కథను సిద్ధం చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆయనే తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన పూర్తి వివరాలతో త్వరలో వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 50వ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. ధనుష్‌ తన సోదరి కొడుకును హీరోగా పరిచయం చేస్తూ నిలావుక్కు ఏన్‌ ఎన్‌మేల్‌ కోపం అనే చిత్రాన్ని స్వీయ దర్శక్వంలో నిర్మిస్తూ కీలక పాత్రలో నటిస్తున్నారు. అదే విధంగా సంగీత దర్శకుడు ఇళయరాజా బయోపిక్‌లో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆ తరువాత ఓం ప్రకాశ్‌ దర్శకత్వంలో చిత్రాన్ని చేసే అవకాశం ఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement