14 కేంద్రాల్లో నిర్వహణ
ఉదయం 10 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష
నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
కేయూ క్యాంపస్ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే ఐసెట్ గురువారం జరుగనుంది. జిల్లా కేంద్రంలో పద్నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్ష పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రత్యేక పరిశీలకులను నియమించామని వరంగల్ రీజినల్ సెంటర్ కోఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రిన్సిపాల్ కె.సాయిలు తెలిపారు.
ఉదయం 10నుంచి మధ్యాహ్నం 12-30గంటల వరకు జరిగే పరీక్షకు వరంగల్ రీజినల్ పరిధిలో 7,870 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని పేర్కొన్నారు. అభ్యర్థులు 9గంటల వరకే కేంద్రాలకు చేరుకోవాలని, నిర్ణీత సమయం కంటే ఒక్క నిముషం ఆలస్యంగా వచ్చినా అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద తొలుత అభ్యర్థుల వేలిముద్రలు, ఫొటోలు తీసుకుంటామని.. దీని కోసం ప్రత్యేకంగా బయోమెట్రిక్ ఇన్విజిలేటర్లను నియమించామని వెల్లడించారు. కాగా, అభ్యర్థులు బ్లూ లేదా బ్లాక్ బాల్‌పారుుంట్ పెన్ తప్ప సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు వెంట తీసుకురావొద్దని సారుులు సూచించారు.