మావగారే మార్చారు! | My gentle father-in-law made me realise, Shah Rukh Khan | Sakshi
Sakshi News home page

మావగారే మార్చారు!

Published Mon, Aug 3 2015 5:18 PM | Last Updated on Sun, Sep 3 2017 6:43 AM

మావగారే మార్చారు!

మావగారే మార్చారు!

ముంబై:నగరంలోని వాంఖేడి క్రికెట్ మైదానంలో ప్రవేశానికి సంబంధించి తనపై గత మూడేళ్లుగా కొనసాగిన నిషేధం తొలగిపోవడంపై కోల్ కతా నైట్ రైడర్స్ సహ యజమాని, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సంతోషం వ్యక్తం చేశాడు.  తొలుత నిషేధాన్నిఎత్తివేసిన ముంబై క్రికెట్ సంఘం(ఎంసీఏ)కు షారుఖ్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆనందాన్ని వ్యక్తం చేసిన షారుఖ్..  తాను చేసిన తప్పుల నుంచి కానీ, ఒప్పుల నుంచి కానీ గుణపాఠాలు నేర్చుకోవడానికి తన మావయ్యే ప్రధాన కారణమని షారుఖ్ తెలిపాడు. 'ఎంసీఏ తీసుకున్న నిర్ణయంపై ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను కొన్ని సందర్భాల్లో చేసిన తప్పు-ఒప్పులను బేరీజు వేసుకోవడానికి మావయ్య సలహాలు తీసుకుంటాను. ఆయన సలహాలు నాకు ఎంతగానో ఉపయోగపడుతుంటాయి' అని షారుఖ్ ట్వీట్ చేశాడు.


వాంఖడే క్రికెట్ మైదానంలో ప్రవేశంపై బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌పై మూడేళ్ల నిషేధాన్ని ఆదివారం ఎంసీఏ తొలగించింది. 2012 ఐపీఎల్‌లో ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ సహ యజమాని షారుఖ్... స్టేడియం భద్రతా అధికారితో దురుసుగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన ఎంసీఏ అతడిని స్టేడియంలోకి అనుమతించకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement