ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్-2014 నోటిఫికేషన్ శుక్రవారం జారీ అయింది.
హన్మకొండ, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్-2014 నోటిఫికేషన్ శుక్రవారం జారీ అయింది. మే 23న పరీక్ష ఉంటుందని ఐసెట్ కో ఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. ఈనెల 24 నుంచి అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలను ఠీఠీఠీ.్చఞజీఛ్ఛ్టి.ౌటజ.జీ వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు.