I cet notification
-
నేడు ఐసెట్ షెడ్యూల్ విడుదల
కరీంనగర్: ఐసెట్ - 2015 షెడ్యూల్ బుధవారం విడుదల చేయనున్నట్లు కాకతీయ యూనివర్సిటీ ఇన్చార్జి వీసీ కడారు వీరారెడ్డి తెలిపారు. ఈ ఏడాది ఐసెట్ నిర్వహణ బాధ్యతలను కేయూకు అప్పగించిన విషయం తెలిసిందే. కరీంనగర్‌లోని శాతవాహన వర్సిటీ వీసీ వీరారెడ్డి కేయూ ఇన్చార్జి వీసీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన బుధవారం శాతవాహన యూనివర్సిటీ పరిపాలన విభాగంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దీనికి రాష్ర్ట ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, రిజిస్ట్రార్ కోమల్రెడ్డిలు హాజరు కానున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహణ షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు రిజిస్ట్రార్ కోమల్‌రెడ్డి తెలిపారు. -
ఐసెట్ నోటిఫికేషన్ జారీ
హన్మకొండ, న్యూస్‌లైన్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఐసెట్-2014 నోటిఫికేషన్ శుక్రవారం జారీ అయింది. మే 23న పరీక్ష ఉంటుందని ఐసెట్ కో ఆర్డినేటర్, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఓంప్రకాశ్ తెలిపారు. ఈనెల 24 నుంచి అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. మరిన్ని వివరాలను ఠీఠీఠీ.్చఞజీఛ్ఛ్టి.ౌటజ.జీ వెబ్సైట్లో పొందుపరిచినట్లు తెలిపారు.