'మిడిల్ క్లాస్ అబ్బాయ్‌' వచ్చేశాడు.. | nani releases MCA FirstLook | Sakshi
Sakshi News home page

'మిడిల్ క్లాస్ అబ్బాయ్‌' వచ్చేశాడు.. ఇదిగో ఇలా ఉంటాడు!

Published Wed, Oct 18 2017 6:03 PM | Last Updated on Wed, Oct 18 2017 7:22 PM

nani releases MCA FirstLook

సాక్షి, హైదరాబాద్‌: వరుస విజయాలతో జోరుమీదున్న నాచురల్‌ స్టార్‌ నాని తాజా సినిమా 'ఎంసీఏ' (మిడిల్ క్లాస్ అబ్బాయి)'. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో నాని సరసన 'ఫిదా' స్టార్‌ సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ను బుధవారం విడుదల చేశారు.

'అందరికీ దీపావళి శుభాకాంక్షలు.. మీ మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' అంటూ హీరో నాని ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. లుంగీ కట్టుకొని చేతిలో పాల ప్యాకెట్‌ పట్టుకొని.. పల్లెలో పక్కా మాస్‌లుక్‌తో నాని ఈ ఫస్ట్‌లుక్‌లో దర్శనమిచ్చాడు. ఈ లుక్‌ని నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement