
కోటలో మిడిల్ క్లాస్
ఒకప్పుడు రాజులున్న చోటది. రాజదర్పానికి ప్రతీకగా నిలిచిన కోట అది. ఇప్పుడు అందులో ఓ కుర్రాడు సందడి చేస్తున్నాడు. అలాగని, అతడి బ్యాగ్రౌండ్ రిచ్ ఏమీ కాదు. మిడిల్ క్లాస్! మరి, ఆ కోటలో ఏం చేస్తున్నాడనేది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే. నాని హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘ఎంసిఎ’. ఇందులో నాని ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’గా నటిస్తున్నాడు.
సినిమా క్యాప్షన్ కూడా అదే... మిడిల్ క్లాస్ అబ్బాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ వరంగల్‌లో జరుగుతోంది. శుక్ర, శనివారాలు వరంగల్ కోట (ఫోర్ట్), పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. కోటలో మిడిల్ క్లాస్ కుర్రాడు ఏం చేశాడో మరి! సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మాతలు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు.