యాక్టివాపై వెళ్తున్న ఎంబీఏ విద్యార్థి ప్రై వేటు బస్సు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది.
సనత్‌నగర్: యాక్టివాపై వెళ్తున్న ఎంబీఏ విద్యార్థి ప్రై వేటు బస్సు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్.ఐ. ఈశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం...కూకట్‌పల్లి వివేకానందనగర్ కాలనీకి చెందిన నారాయణరెడ్డి కుమారుడు సాయికృష్ణ మల్లారెడ్డి కళాశాలలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు.
బుధవారం మధ్యాహ్నం కంప్యూటర్ విడి పరికరాల కోసం యాక్టివా వాహనంపై అమీర్‌పేట్ మైత్రీవనంకు వెళ్లాడు. తిరిగి వస్తుండగా భరత్‌నగర్ వద్ద హెటిరో కంపెనీకి చెందిన బస్సు బలంగా ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడ్డ సాయికృష్ణను కూకట్‌పల్లి రాందేవ్‌రావ్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.