
అహ్మదాబాద్ : హరీశ్ విటల్ చదివింది ఎంబీఏ. కానీ ఉద్యోగం నవ్‌రంగ్‌పుర పోలీసు స్టేషన్‌లో లోక్ రక్షక్ దల్(ఎల్‌ఆర్‌డీ) జవానుగా పోస్టింగ్. హరీశ్ ఒక్కడే కాదు అదే పోలీసు స్టేషన్‌కు ఇటీవల బదిలీ అయిన మరో ఇద్దరు కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్లే. అదే పోలీసు స్టేషన్‌లో బీసీఏ, బీఏ, బీఎడ్, పీజీడీసీఏ, ఎంఎస్‌సీ వంటి ప్రొఫిషనల్ డిగ్రీలు కలిగి వారు మరో ఐదుగురు ఉన్నారు. ఇలా మెజార్టీ పోలీస్ స్టేషన్‌లలో లోక్ రక్షక్ దల్ జవానుగా ఎంపికైన వారు ఎక్కువగా ప్రొఫిషనల్ డిగ్రీవారే ఉన్నారని తెలిసింది. అంటే గతేడాది గుజరాత్ పోలీసు విభాగం నిర్వహించిన పరీక్షలో ఎల్‌ఆర్‌డీ జవానులుగా ఎంపికైన వారిలో చాలా మంది ప్రొఫిషనల్ డిగ్రీ అభ్యర్థులు కలిగివారేనని వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హత కేవలం పన్నెండో తరగతి ఉత్తీర్ణత అయితే చాలు.
కానీ ఈ కానిస్టేబుల్ పోస్టులకు ఎక్కువగా ఎంబీఏలు, టెకీలు, ఇంజనీర్లే అర్హత సాధించినట్టు తెలిసింది. ఐదేళ్ల కాలానికి పిక్స్‌డ్ పేతో ఎల్‌ఆర్‌డీలను నియమిస్తారు. ఆ తర్వాత రెగ్యులర్ కానిస్టేబుల్‌గా వీరికి పోస్టింగ్ ఇస్తారు. మొత్తం ఎంపికైన 17,532 మంది ఎల్‌ఆర్‌డీ జవాన్లలో 50 శాతం మందికి పైగా గ్రాడ్యుయేట్లు, పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలు కలిగిన వారే ఉన్నారని 2017 ఎల్‌ఆర్డీ రిక్రూట్‌మెంట్ చైర్మన్, వడోదర రేంజ్ ఐజీపీ జీఎస్ మాలిక్ చెప్పారు. అర్హత కంటే మించిన వారే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నట్టు పేర్కొన్నారు. ప్రైవేట్ రంగ ఉద్యోగాల్లో భద్రత లేకపోవడంతో, ఎక్కువగా యువత తక్కువ ప్రొఫైల్, వేతనం ఉన్నప్పటికీ, సెక్యుర్ జాబ్స్ వైపే ఆసక్తి చూపుతున్నట్టు గుజరాత్ యూనివర్సిటీ సోషయాలజీ డిపార్ట్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ గౌరంగ్ జాని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment