పట్టపగలే ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి | BJP Lawmaker's Daughter Stabbed By Stalker On Campus | Sakshi
Sakshi News home page

పట్టపగలే ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి

Published Tue, Apr 4 2017 5:25 PM | Last Updated on Fri, Mar 29 2019 8:30 PM

పట్టపగలే ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి - Sakshi

పట్టపగలే ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి

పుణె: పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఎంబీఏ చదువుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి జరిగింది. తనను ప్రేమించమంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నప్పటికీ తిరస్కరించిందనే విద్వేషంతో ఓ యువకుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన వారు కూడా ఈ దాడిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డారు. అయితే, ఎట్టకేలకు బాధితురాలిని రక్షించగలిగారు. ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తి ఆమె చేతి చిటికెన వేలిని పూర్తిగా నరికివేశాడు.

పోలీసుల వివరాల ప్రకారం బీజేపీకి చెందిన ఎమ్మల్యే సంజీవ్‌ రెడ్డి బోద్‌కుర్వార్‌కు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కూతురు అశ్విని రెడ్డి(22) పుణెలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఆమె సోదరుడు కూడా అక్కడే చదువుతున్నాడు. అశ్వినిరెడ్డి వెంట గత కొంతకాలంగా రాజేశ్‌ ప్రవీణ్‌ కుమార్‌ భక్షి(23) అనే యువకుడు వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని అశ్విని కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో తనపైన ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా అతడు కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పుణెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటోంది.

శ్రీ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికం మేనేజ్‌మెంట్‌ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన భక్షిది హర్యానా అని, అశ్వినికి అతడికి మధ్య గత ఎనిమిది నెలలుగా పరిచయం ఉందని, ఈ మధ్య అతడి ప్రవర్తనలో మార్పు వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టి చివరకు ఈ దారుణానికి దిగాడని పోలీసులు చెప్పారు. అశ్విని తల్లిదండ్రులు ఈ ఘటన గురించి తెలియగానే పుణె చేరుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement