ashwini reddy
-
‘అభిలాష’మూవీ ఎలా ఉందంటే..
టైటిల్: అభిలాష నటీనటులు: అమర్ దీప్, అశ్విని రెడ్డి, బాహుబలి ప్రభాకర్, సమ్మెట గాంధీ, కుమనన్ సేతురామన్ తదితరులు నిర్మాణ సంస్థ: హరిహర ధీర మూవీ మేకర్స్ నిర్మాత: సీహెచ్ శిరీష దర్శకత్వం: శివపస్రాద్ చలవాది సంగీతం : ఏంఏం కుమార్ నేపథ్య సంగీతం: రోహి బాబు సినిమాటోగ్రఫీ: సౌమ్యశర్మ ఎడిటర్: రవితేజ విడుదల తేది: జూన్ 2, 2023 ‘అభిలాష’కథేంటంటే.. వైదేహి(అశ్విని రెడ్డి) ఓ అనగారిన వర్గానికి చెందిన యువతి. ఉన్నత చదువులు చదివి, కలెక్టర్ కావాలనేది ఆమె కోరిక. కానీ ఆమె ఉన్న ఊర్లో అనగారిన వర్గానికి చెందిన వాళ్లు పెద్ద చదువులు చదువొద్దని కండీషన్ పెడతాడు గ్రామ పెద్ద. దీంతో ఊరి పెద్దకు తెలియకుండా వైజాగ్‌లో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంది వైదేహి. ఈ క్రమంలో ఆమెకు శ్రీరామ్(అమర్దీప్) పరిచయం అవుతాడు. అతను ఉద్యోగం కోసం వైజాగ్ వచ్చి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని అబద్దం చెప్పి వైదేహికి క్లోజ్ అవుతాడు. శ్రీరామ్ ఎందుకు వైదేహికి క్లోజ్ అయ్యాడు? సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వైదేహిని చంపేందుకు ప్రయత్నించేది ఎవరు? ఎందుకు? చివరకు వైదేహి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అభిలాష’ చూడాల్సిందే. ఎలా ఉందంటే.. సరిగ్గా 40 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అభిలాష’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఈ ‘అభిలాష’ చిత్రం అందుకోలేకపోయింది. కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం ఇచ్చింది. విద్య అనేది ఒక వర్గానికే కాదు, అందరికి ముఖ్యమనే మంచి మెసేజ్‌ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో కాస్త విఫలం అయ్యాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. అంతా కొత్తవాళ్లు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు. ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయాలకొస్తే.. శ్రీరామ్‌గా అమర్ దీప్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌లో ఈజ్‌తో చేశాడు. వైదేహిగా అశ్విని రెడ్డి చక్కగా నటించింది. సమ్మెట్ట గాంధీ, బాహుబలి ప్రభాకర్, కుమనన్తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తిరుపతి జావన అందించిన సాహిత్యం బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ శృతిమించింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. -
మంచి సందేశంతో ‘అభిలాష’
అమర్ దీప్, అశ్వినీ రెడ్డి హీరో హీరోయిన్లుగా శివప్రసాద్ చలువాది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అభిలాష’. సీహెచ్ శిరీష నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు పృథ్వీ ఈ సినిమా సీడీ, ట్రైలర్‌ను రిలీజ్ చేసి, ‘‘ఓ మంచి పాయింట్‌తో తీసిన ఈ చిత్రం ట్రైలర్ బాగుంది’’ అన్నారు. ‘‘వల్గారిటీ లేకుండా విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శివ ప్రసాద్. ‘‘బలగం’ సినిమా కోవలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత సీహెచ్ శిరీష. -
రష్మిక ధరించిన చీర, ఉంగరం ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ అని అర్థమవుతోందా? ఈ నేషనల్ క్రష్ మనసు దోచి ఆమె వార్డ్‌రోబ్‌లోకి చేరిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం.. త్యానీ బై కరణ్ జోహార్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత కరణ్ జోహార్ నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన ఆలోచనతో సూపర్ హిట్ సినిమాలనే కాదు, అందమైన ఆభరణాలకూ రూపకల్పన చేయగలడని నిరూపించాడు. నిదర్శనం 2017లో ప్రారంభించిన ‘త్యానీ బై కరణ్ జోహార్ జ్యూయెలరీ’. బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఈ ఆభరణాలు ఎంతోమంది సెలబ్రిటీల ఫేవరెట్. చూడటానికి ఈ ఆభరణాల మెరుపు రాత్రివేళ ఆకాశంలో మెరిసే నక్షత్రాలను తలపిస్తే, వీటి ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు. జ్యూయెలరీ బ్రాండ్: త్యానీ బై కరణ్ జోహార్ నెక్‌పీస్ ధర : రూ. 2,86,300 ఉంగరం ధర: రూ. 97,610 అశ్విని రెడ్డి హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. టాప్‌మోస్ట్ ఫ్యాషన్‌గా డిజైనర్‌గా ఎదిగింది. బీటెక్ తర్వాత ఎన్ఐఎఫ్టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తయ్యాక, ఇటలీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో స్పెషలైజేషన్ చేసింది అశ్విని రెడ్డి. 2009లో తన పేరు మీదే హైదరాబాద్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. వెస్టర్న్ లుక్కు సంప్రదాయ శైలితో కూడిన ఎంబ్రాయిడరీ జోడిస్తూ ఎన్నో కలెక్షన్స్‌ను రూపొందించింది. కొద్దిరోజుల్లోనే ఆమె డిజైన్స్ పాపులర్ కావడంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. 2018 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన ‘తిలోత్తమ కలెక్షన్స్’తో ఆమె ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ డిజైనర్ అంటే ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అనుకోకండి. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది. చీర డిజైనర్ : అశ్విని రెడ్డి ధర: రూ. 48,000 ►షాప్‌కి వెళ్లి, సెలక్ట్ చేసుకుని, ట్రై చేయడం.. నాకు చాలా కష్టం. కన్ఫ్యూజ్ అయిపోతా. అందుకే, ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాను – రష్మిక మందన్నా. -దీపిక కొండి చదవండి: Pooja Hegde: ‘బుట్టబొమ్మ’ డ్రెస్ మరీ అంత ఖరీదా?! -
పట్టపగలే ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి
పుణె: పట్టపగలే దారుణం చోటుచేసుకుంది. ఎంబీఏ చదువుతున్న ఓ బీజేపీ ఎమ్మెల్యే కూతురుపై కత్తితో దాడి జరిగింది. తనను ప్రేమించమంటూ గత కొంతకాలంగా వెంటపడుతున్నప్పటికీ తిరస్కరించిందనే విద్వేషంతో ఓ యువకుడు ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. ఆమెను రక్షించేందుకు వచ్చిన వారు కూడా ఈ దాడిని అడ్డుకునే క్రమంలో గాయపడ్డారు. అయితే, ఎట్టకేలకు బాధితురాలిని రక్షించగలిగారు. ఈ క్రమంలో దాడి చేసిన వ్యక్తి ఆమె చేతి చిటికెన వేలిని పూర్తిగా నరికివేశాడు. పోలీసుల వివరాల ప్రకారం బీజేపీకి చెందిన ఎమ్మల్యే సంజీవ్ రెడ్డి బోద్కుర్వార్కు ఓ కూతురు, ఓ కుమారుడు ఉన్నారు. కూతురు అశ్విని రెడ్డి(22) పుణెలోని ఓ కాలేజీలో ఎంబీఏ చదువుతోంది. ఆమె సోదరుడు కూడా అక్కడే చదువుతున్నాడు. అశ్వినిరెడ్డి వెంట గత కొంతకాలంగా రాజేశ్ ప్రవీణ్ కుమార్ భక్షి(23) అనే యువకుడు వెంటపడుతున్నాడు. తనను ప్రేమించాలని వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని అశ్విని కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. దీంతో తనపైన ఫిర్యాదు చేసినందుకు ప్రతీకారంగా అతడు కత్తితో దాడి చేశాడు. ప్రస్తుతం ఆమె పుణెలోని ఓ ఆస్పత్రిలో కోలుకుంటోంది. శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెలికం మేనేజ్మెంట్ కాలేజీలో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడి చేసిన భక్షిది హర్యానా అని, అశ్వినికి అతడికి మధ్య గత ఎనిమిది నెలలుగా పరిచయం ఉందని, ఈ మధ్య అతడి ప్రవర్తనలో మార్పు వచ్చి ఆమెను వేధించడం మొదలుపెట్టి చివరకు ఈ దారుణానికి దిగాడని పోలీసులు చెప్పారు. అశ్విని తల్లిదండ్రులు ఈ ఘటన గురించి తెలియగానే పుణె చేరుకున్నారు.