టైటిల్: అభిలాష
నటీనటులు: అమర్ దీప్, అశ్విని రెడ్డి, బాహుబలి ప్రభాకర్, సమ్మెట గాంధీ, కుమనన్ సేతురామన్ తదితరులు
నిర్మాణ సంస్థ: హరిహర ధీర మూవీ మేకర్స్
నిర్మాత: సీహెచ్ శిరీష
దర్శకత్వం: శివపస్రాద్ చలవాది
సంగీతం : ఏంఏం కుమార్
నేపథ్య సంగీతం: రోహి బాబు
సినిమాటోగ్రఫీ: సౌమ్యశర్మ
ఎడిటర్: రవితేజ
విడుదల తేది: జూన్ 2, 2023
‘అభిలాష’కథేంటంటే..
వైదేహి(అశ్విని రెడ్డి) ఓ అనగారిన వర్గానికి చెందిన యువతి. ఉన్నత చదువులు చదివి, కలెక్టర్ కావాలనేది ఆమె కోరిక. కానీ ఆమె ఉన్న ఊర్లో అనగారిన వర్గానికి చెందిన వాళ్లు పెద్ద చదువులు చదువొద్దని కండీషన్ పెడతాడు గ్రామ పెద్ద. దీంతో ఊరి పెద్దకు తెలియకుండా వైజాగ్‌లో సివిల్స్‌కి ప్రిపేర్ అవుతుంది వైదేహి. ఈ క్రమంలో ఆమెకు శ్రీరామ్(అమర్‌దీప్) పరిచయం అవుతాడు. అతను ఉద్యోగం కోసం వైజాగ్ వచ్చి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నానని అబద్దం చెప్పి వైదేహికి క్లోజ్ అవుతాడు. శ్రీరామ్ ఎందుకు వైదేహికి క్లోజ్ అయ్యాడు? సివిల్స్ ప్రిపేర్ అవుతున్న వైదేహిని చంపేందుకు ప్రయత్నించేది ఎవరు? ఎందుకు? చివరకు వైదేహి తన లక్ష్యాన్ని నెరవేర్చుకుందా? లేదా? అనేది తెలియాలంటే థియేటర్స్‌లో ‘అభిలాష’ చూడాల్సిందే.
ఎలా ఉందంటే..
సరిగ్గా 40 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘అభిలాష’ చిత్రం ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. అదే పేరుతో ఓ సినిమా వస్తుందంటే కచ్చితంగా భారీ అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు ఈ ‘అభిలాష’ చిత్రం అందుకోలేకపోయింది. కానీ ఓ మంచి సందేశాన్ని మాత్రం ఇచ్చింది. విద్య అనేది ఒక వర్గానికే కాదు, అందరికి ముఖ్యమనే మంచి మెసేజ్‌ని ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు.
దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగున్నప్పటికీ తెరపై చూపించడంలో కాస్త విఫలం అయ్యాడు. మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే.. అంతా కొత్తవాళ్లు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నాడు.
ఇక నటీనటుల ఫెర్పార్మెన్స్ విషయాలకొస్తే.. శ్రీరామ్‌గా అమర్ దీప్ తన పాత్రకు న్యాయం చేశాడు. యాక్షన్ సీన్స్‌లో ఈజ్‌తో చేశాడు. వైదేహిగా అశ్విని రెడ్డి చక్కగా నటించింది. సమ్మెట్ట గాంధీ, బాహుబలి ప్రభాకర్, కుమనన్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. తిరుపతి జావన అందించిన సాహిత్యం బాగుంది. నేపథ్య సంగీతం అక్కడక్కడ శృతిమించింది. సినిమాటోగ్రాఫర్, ఎడిటర్ పనితీరు పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment