30 Years Prudhvi Launched By Abhilasha Trailer, Deets Inside - Sakshi
Sakshi News home page

మంచి సందేశంతో ‘అభిలాష’

Published Thu, Apr 20 2023 12:54 PM | Last Updated on Thu, Apr 20 2023 1:19 PM

30 Years Prudhvi Launched By Abhilasha Trailer - Sakshi

అమర్‌ దీప్, అశ్వినీ రెడ్డి హీరో హీరోయిన్లుగా శివప్రసాద్‌ చలువాది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అభిలాష’. సీహెచ్‌ శిరీష నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ వేడుక హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నటుడు పృథ్వీ ఈ సినిమా సీడీ, ట్రైలర్‌ను రిలీజ్‌ చేసి, ‘‘ఓ మంచి పాయింట్‌తో తీసిన ఈ చిత్రం ట్రైలర్‌ బాగుంది’’ అన్నారు.

‘‘వల్గారిటీ లేకుండా విద్యకు ఉన్న ప్రాధాన్యాన్ని సందేశాత్మకంగా ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు శివ ప్రసాద్‌. ‘‘బలగం’ సినిమా కోవలో ఈ సినిమా కూడా విజయం సాధిస్తుంది’’ అన్నారు నిర్మాత సీహెచ్‌ శిరీష.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement