![Top 10 Telugu Classic Movies Based On Novels - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/26/Movies-Adopted-From-Novels1.jpg.webp?itok=HJ6cFvRC)
Top 10 Telugu Classic Movies Based On Novels: సాధారణంగా మనం చాలా సినిమాలను వాటి ట్రైలర్స్, టీజర్స్, ప్రమోషన్స్ నచ్చిన తర్వాత చూస్తాం. ఆ మూవీస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటే వాటి గురించి పరిశోధిస్తాం. అవి రీమెక్ చేశారా? డబ్బింగ్ మూవీస్ ఆ? హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొట్టారా? లేదా ఏవైనా పుస్తకాలు, నవలల నుంచి స్ఫూర్తి పొంది తీశారా? అని. ఇలా ఏదో ఒక విధంగా తీసిని చిత్రాలంటే కొంచెం ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి సైతం మనం మొగ్గుచూపుతాం.
అలాగే రీమెక్ చిత్రాలైతే ఒరిజనల్ అండ్ రీమెక్ సినిమాలతో పోల్చడం వంటి విషయాలు మనకు ఒకరకమైన కిక్‌ను కూడా ఇస్తుంది. కాపీ సినిమాలు అయితే ఇంతకుముందు అలా మరే సినిమాలు వచ్చాయో తెలుసుకోవాలనే కుతుహలం ఏర్పడుతుంది. ఇలానే పాపులర్ అయిన కొన్ని నవలల నుంచి తీసుకున్న తెలుగు క్లాసిక్ సినిమాలు మీకోసం.
1. అభిలాష- యండమూరి వీరేంద్రనాథ్ (అభిలాష)
2. చంటబ్బాయి- మల్లాది వెంకటకృష్ణ మూర్తి (చంటబ్బాయి)
3. మీనా- యుద్దనపూడి సులోచనరాణి (మీనా)
4. సెక్రటరీ- యుద్దనపూడి సులోచనరాణి (సెక్రటరీ)
5. ప్రేమ్ నగర్- కోడూరి కౌసల్య దేవి
6. కాష్మోరా- యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం)
7. అహా నా పెళ్లంటా- ఆది విష్ణు (సత్యం గారిల్లు)
8. డాక్టర్ చక్రవర్తి- కోడూరి కౌసల్య దేవి (చక్రభ్రమణం)
9. కన్యాశుల్కం- గురజాడ అప్పారావు
10. సితార- వంశీ (మహల్లో కోకిల)
Comments
Please login to add a commentAdd a comment