Meena Movie
-
పాపులర్ నవలలు.. వాటి ఆధారంగా వచ్చిన సినిమాలు
Top 10 Telugu Classic Movies Based On Novels: సాధారణంగా మనం చాలా సినిమాలను వాటి ట్రైలర్స్, టీజర్స్, ప్రమోషన్స్ నచ్చిన తర్వాత చూస్తాం. ఆ మూవీస్ కొంచెం ఆసక్తికరంగా ఉంటే వాటి గురించి పరిశోధిస్తాం. అవి రీమెక్ చేశారా? డబ్బింగ్ మూవీస్ ఆ? హాలీవుడ్ చిత్రాల నుంచి కాపీ కొట్టారా? లేదా ఏవైనా పుస్తకాలు, నవలల నుంచి స్ఫూర్తి పొంది తీశారా? అని. ఇలా ఏదో ఒక విధంగా తీసిని చిత్రాలంటే కొంచెం ఆసక్తి ఎక్కువగానే ఉంటుంది. అలాంటి సినిమాలు చూడటానికి, పుస్తకాలు చదవడానికి సైతం మనం మొగ్గుచూపుతాం. అలాగే రీమెక్ చిత్రాలైతే ఒరిజనల్ అండ్ రీమెక్ సినిమాలతో పోల్చడం వంటి విషయాలు మనకు ఒకరకమైన కిక్‌ను కూడా ఇస్తుంది. కాపీ సినిమాలు అయితే ఇంతకుముందు అలా మరే సినిమాలు వచ్చాయో తెలుసుకోవాలనే కుతుహలం ఏర్పడుతుంది. ఇలానే పాపులర్ అయిన కొన్ని నవలల నుంచి తీసుకున్న తెలుగు క్లాసిక్ సినిమాలు మీకోసం. 1. అభిలాష- యండమూరి వీరేంద్రనాథ్ (అభిలాష) 2. చంటబ్బాయి- మల్లాది వెంకటకృష్ణ మూర్తి (చంటబ్బాయి) 3. మీనా- యుద్దనపూడి సులోచనరాణి (మీనా) 4. సెక్రటరీ- యుద్దనపూడి సులోచనరాణి (సెక్రటరీ) 5. ప్రేమ్ నగర్- కోడూరి కౌసల్య దేవి 6. కాష్మోరా- యండమూరి వీరేంద్రనాథ్ (తులసిదళం) 7. అహా నా పెళ్లంటా- ఆది విష్ణు (సత్యం గారిల్లు) 8. డాక్టర్ చక్రవర్తి- కోడూరి కౌసల్య దేవి (చక్రభ్రమణం) 9. కన్యాశుల్కం- గురజాడ అప్పారావు 10. సితార- వంశీ (మహల్లో కోకిల) -
మహిళా దర్శకులకు ఆదర్శం ఆమె!
పురుషాధిక్య సినీ ప్రపంచంలోకి ఒంటరిగా అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారమె. కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తన సత్తాను చాటారామె. తెలుగులో భానుమతి, సావిత్రి తరువాత దర్శకత్వం వహించిన మూడో మహిళగా ఖ్యాతిగాంచిన ఆమె మరెవరో కాదు బహుముఖ ప్రజ్ఞాశాలి విజయనిర్మల. ఆమె పుట్టిన రోజు సందర్భంగా విజయనిర్మల గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి. -
మహిళా దర్శకులకు ఆదర్శం ఆమె!
-
గిన్నిస్ రికార్డ్‌కు తొలి అడుగు ‘నంద్యాల’ నుంచే
సాక్షి, నంద్యాల : ప్రముఖ సినీనటి, దర్శకురాలు విజయనిర్మలకు తొలిసారిగా తెలుగులో డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన ఘనత నంద్యాలకు చెందిన ప్రముఖ వ్యాపారి దివంగత గాజుల పెద్ద మల్లయ్య. వెంకటకృష్ణ పతాకంపై హీరో కృష్ణ, హీరోయిన్ విజయనిర్మలను ఆయన మీన చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన ఆమె.. ఆ తర్వాత తన ప్రతిభతో 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా డైరెక్టర్‌గా స్థానం సంపాదించారు. గాజుల మల్లయ్య వ్యాపారం రీత్యా 1965లో మద్రాస్‌కు వెళ్తుండేవారు. ఈ క్రమంలో తెలుగు సినిమాల్లో అప్పుడప్పుడే హీరోగా పేరు తెచ్చుకుంటున్న కృష్ణతో స్నేహం ఏర్పడింది. ఈ స్నేహంతో ఆయన 1970లో ప్రముఖ రచయిత్రి యుద్ధనపూడి సులోచనరాణి రాసిన మీనా నవల ఆధారంగా అదే పేరుతో మిత్రుడు టీవీ రమణ సహకారంతో వెంకటకృష్ణ బ్యానర్‌పై చిత్రనిర్మాణం చేపట్టారు. కృష్ణ, విజయనిర్మల హీరో, హీరోయిన్గా పెద్ద మల్లయ్య దర్శకత్వం బాధ్యతలను విజయనిర్మలకు అప్పగించారు. అలా ఆమె తొలిసారిగా తెలుగులో దర్శకత్వం వహించారు. సినిమా హిట్ కావడంతో విజయ నిర్మలకు మంచిపేరుతో పాటు అవకాశాలు కూడా దక్కాయి. తర్వాత 1974లో పెద్దమల్లయ్య ఇదే పతాకంపై దేవదాసు చిత్రాన్ని కృష్ణ, విజయనిర్మలతో ఆమె దర్శకత్వంలో నిర్మించారు. కాని ఈ చిత్రం ప్రేక్షకులకు ఆకట్టుకోక పోవడంతో నష్టాలు వచ్చాయి. దీంతో పెద్ద మల్లయ్య చిత్రపరిశ్రమను వదిలేసి నంద్యాలకు వచ్చి వ్యాపారాన్ని కొనసాగించారు. పదేళ్ల క్రితం పెద్ద మల్లయ్య ఎస్బీఐ కాలనీలోని తన కుమారుడి ఇంట్లో ఉంటూ మృతి చెందారు. దర్శకురాలిగా విజయనిర్మల సాధించిన ఘనత వెనుక పెద్దమల్లయ్య ఇచ్చిన అవకాశం, ప్రోత్సాహం మరువలేనిది అని నంద్యాల సినీ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఒందిపోటు భీమన్న చిత్రం షూటింగ్ నంద్యాలలో.. మల్లికార్జున రావు దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల, ఎస్వీ రంగారావు నటించిన చిత్రం బందిపోటు భీమన్న షూటింగ్ 1968లో నంద్యాల, ఆళ్లగడ్డ, అహోబిలంలో దాదాపు పది రోజుల పాటు జరిగింది. ఈ సందర్భంగా కృష్ణ, విజయనిర్మల నంద్యాలలో బస చేశారు. 1969 డిసెంబర్13న ఈ సినిమా విడుదలయ్యింది. -
విజయనిర్మలకు మొండి 'చేయి'
దేశంలో వివిధ రంగాల్లో వ్యక్తులు, ప్రముఖులు అందించిన సేవలకు గుర్తింపు భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రకటించిన ప్రతిసారి ఏదో ఒక వివాదం పద్మ అవార్డులను చుట్టుముడుతోంది. పద్మ అవార్డుల ప్రకటించడంపై అనేక వివాదాలు, ఆరోపణలు, విమర్శలు వస్తూనే ఉన్నాయి. మహిళా సాధికారిత, మహిళా చైతన్యం అంటూ వీలు చిక్కినప్పుడల్లా ఊక దంపుడు ఉపన్యాసాలు చేసే ప్రభుత్వాలు.. సరియైన ప్రతిభను, ప్రతిభావంతులను గుర్తించడంలో విఫలమవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. గత కొద్దికాలంగా పద్మ అవార్డుల ప్రకటించిన తీరు చూస్తే.. ప్రాంతీయతత్వం, కులం, మతం, రాజకీయాలనే అంశాలే ప్రభావం చూపుతున్నట్టు స్పష్టంగా అర్ధమవుతోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన పద్మ అవార్డులు కొంత ఊరట లభించేలా ఉన్నా.. ప్రతిభావంతురాలైన నటి, దర్శకురాలు విజయనిర్మలకు పద్మ అవార్డు ప్రకటించకపోవడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే విజయనిర్మల పేరు ప్రముఖంగా వినిపించడానికి కారణం వెనుక ఈసారి ప్రకటించిన పద్మ అవార్టుల జాబితాలో బాలీవుడ్ నటి విద్యా బాలన్ పేరు కనిపించడమే. వందేళ్ల భారతీయ సినీ పరిశ్రమ చరిత్ర చూసుకుంటే.. విజయనిర్మల అందించిన సేవలు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. 55 ఏళ్ల క్రితం 'పాండురంగ మహత్యం' చిత్రంలో బాలనటిగా నటించడం చిత్రరంగ ప్రవేశం చేసిన విజయనిర్మల తన కెరీర్ లో తమిళ, మలయాళ చిత్రరంగాల్లో కలిపి 200 చిత్రాలకు పైగానే నటించారు. అంతేకాకుండా చిత్ర పరిశ్రమలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా ఓ ఘనతను విజయనిర్మల సొంతం చేసుకున్నారు. తన సినీ జీవితంలో 49 చిత్రాలకు దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలిగా రికార్డు సృష్టించడమే కాకుండా గిన్నిస్ బుక్ లో చోటు సంపాదించారు. తాను సొంతంగా విజయ కృష్ణ బ్యానర్ పై 15 చిత్రాలను రూపొందించారు. అయినా విజయనిర్మల ప్రతిభ, సేవలు ప్రభుత్వాలకు దృష్టికి రాకపోవడం చాలా విచారకరం. Mrs.vijaynirmala Guinness record holder,woman directed52 films yet to be honoured padmam award,vidhyabalan,has she done 15 films? — sripriya (@sripriya) January 26, 2014 అయితే అత్యంత ఆశ్చర్యం కలిగించే విషయమేమింటే చేతివేళ్లపై లెక్కించదగిన సంఖ్యలో హిందీ సినిమాల్లో నటించిన, విడుదల కాని ఓ చిత్రానికి దర్శకత్వం వహించిన విద్యాబాలన్ కు పద్మ అవార్డును ప్రకటించిడం పలువురికి షాక్ ఇచ్చింది. 2003లో బెంగాలీ చిత్రం నటించడం ద్వారా, 2005లో పరిణీత చిత్రం ద్వారా బాలీవుడ్ లో విద్యాబాలన్ అడుగుపెట్టింది. కాని పరిణీత, డర్టీ పిక్చర్, కహానీ చిత్రాలకు మినహా చెప్పుకోవడానికి పెద్దగా ఏమిలేని విద్యాబాలన్ కు పద్మ అవార్డు లభించడంపై దక్షిణాదిలో పలువురు సినీనటులు బహిరంగంగానే అసంతృప్తిని వెళ్లగక్కారు. Mrs. Lakshmi who has acted in many Indian languages should be remembered — sripriya (@sripriya) January 27, 2014 చిత్ర పరిశ్రమలో సీనియర్ నటులను ప్రభుత్వం విస్మరించడంపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున చర్చకు దారి తీసింది. అలనాటి నటి శ్రీప్రియ కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. దక్షిణాదిలో జమున, కృష్ణకుమారి, లక్ష్మి లాంటి నటీమణులను ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోకపోవడం బాధకరమని శ్రీప్రియ ఆవేదన వ్యక్తం చేశారు. తాజా ఆరోపణలను ఆధారంగా చేసుకుని.. ప్రభుత్వ తీరు పరిశీలిస్తే, లాబీయింగ్ ద్వారానే పద్మ అవార్డులు సొంతం చేసుకోవచ్చు అనే విమర్శకు బలమిచ్చింది. పైరవీలు, లాబీయింగ్ ఉంటే చాలు పద్మ అవార్టులు దక్కించుకోవచ్చు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సీనియర్ల ప్రతిభాపాటవాలను పరిగణనలోకి తీసుకోకపోవడంపై అనేక విమర్శలకు తావిస్తోంది. వివిధ రంగాల్లో వ్యక్తులు, కళాకారులు అందించిన కృషిని, సేవల్ని, ప్రతిభను కొలమానంగా తీసుకోవాలని పలువురు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. ఇకనైనా పద్మ అవార్డులను వివాదాల చుట్టుముట్టకుండా.. వాటి గౌరవాన్ని పెంపొందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -రాజబాబు అనుముల