హరీశ్, వెన్నెలకంటి, కల్పిక, రాకేందుమౌళి, పృథ్వీ
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది.
ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్.
Comments
Please login to add a commentAdd a comment