My Dear Marthandam Movie
-
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్. -
డిసెంబర్ 29న ‘మై డియర్ మార్తాండం’
30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి, రాకేందు మౌళి, కల్పికా గణేష్, జయ ప్రకాష్ రెడ్డి ప్రధాన పాత్రల్లో కోర్టు రూమ్ డ్రామా కామెడి ఇంటరాగేషన్స్ జోనర్లో తెరకెక్కిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ ను అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ విడుదల చేశారు. ఈ సందర్భంగా సందీప్ మాట్లాడుతూ ‘ట్రైలర్ చాలా బాగుంది. పృథ్వి కామెడీ టైమింగ్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ క్రిస్మస్కు సినీ ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకొని మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు. హీరో రాకేందు మౌళి మాట్లాడుతూ ‘మా సినిమా పుల్ లెంగ్త్ కామెడి సస్పెన్స్ జోనర్ లో తెరకెక్కించాం. చాలా బాగుంటుంది’ అని తెలిపారు. దర్శకుడు హరీష్ కె.వి మాట్లాడుతూ ‘సినిమా చాలా బాగా వచ్చింది, కోర్టు రూమ్ డ్రామా, కామెడి ఇంటరాగేషన్స్ బ్యాక్ డ్రాప్లో కథ నడుస్తుంది, సినిమాలో పృథ్వి గారి కామెడి చాలా బాగా వచ్చింది, ఈ డిసెంబర్ 29 న వస్తున్నాం. ప్రేక్షకులు ఆధరించి హిట్ చేస్తారని కోరుకుంటున్నాను’ అన్నారు.