Tagubothu Ramesh
-
ఒక రోజులో జరిగే కథ
భవికా దేశాయ్ ప్రధాన పాత్రలో ‘వెన్నెల’ కిశోర్, రవివర్మ, విజయసాయి, తాగుబోతు రమేష్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘302’. ‘ది ట్రూ స్టోరీ ఆఫ్ రియల్ ఫేక్’ అన్నది ఉపశీర్షిక. కార్తికేయ మిరియాల దర్శకత్వంలో డ్రీమ్ ట్రీ మీడియా పతాకంపై అవినాష్ సుందరపల్లి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదలకానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సునీల్ ఆవిష్కరించి, మాట్లాడుతూ– ‘‘302’ ట్రైలర్ బావుంది.. సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు. ‘‘నట్టీస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ద్వారా మా చిత్రాన్ని విడుదల చేయనున్నాం’’ అన్నారు అవినాష్ సుందరపల్లి. కార్తికేయ మిరియాల మాట్లాడుతూ–‘‘క్రైమ్, సస్పె¯Œ ్స, కామెడీతో పాటు హారర్ అంశాలతో ఆసక్తికరంగా, ఉత్కంఠ భరితంగా ఈ చిత్రాన్ని మలిచాం. ఒక రోజులో జరిగే కథ ఇది. ఒక అమ్మాయి ప్రేమ విషయంలో తల్లిదండ్రులతో గొడవపడి ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆ అమ్మాయి చుట్టూ తిరిగే కథ ఎలాంటి మలుపులు తిరిగిందన్నది తెరపై చూడాల్సిందే’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: కళ్యాణ్ సమీ, రామరాజు, సంగీతం: రఘురాం, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కుమార్ రాజా, సహనిర్మాత: టి..వైకుంఠరావు. -
ఇలాంటి సినిమా అవసరమా అన్నారు..
బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఆదిత్, నిక్కి తంబోలి, హేమంత్, తాగుబోతు రమేష్, ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. ఈ నెల 21న విడుదలైన ఈ చిత్రం సక్సెస్‌మీట్ శనివారం జరిగింది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంతోశ్ పి జయకుమార్ మాట్లాడుతూ– ‘‘చిన్న బడ్జెట్‌తో తయారైన ఈ చిత్రం 2 రోజుల్లోనే దాదాపు 2.5 కోట్ల రూపాయలను రాబట్టడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. దర్శకుడిగా హ్యాపీగా ఉంది. సపోర్ట్ చేసిన యూనిట్‌కు, ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా రిలీజ్ అయ్యేటప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఇలాంటి సినిమాలు అవసరమా? అన్నారు. సినిమా చూడకుండానే చాలా రకాలుగా మాట్లాడారు. అలాంటి వారందరికీ మా సినిమా మంచి సమాధానం చెప్పింది. మా సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్. బి, సిలలో ఆడే సినిమా ఇది అన్నారు. అవకాశం ఇచ్చిన నిర్మాత, దర్శకుడికి థ్యాంక్స్. ఆనందంతో మాటలు రావడం లేదు. ష్యూర్ షాట్‌గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందని ముందే చెప్పాను. నా మాట నిలబెట్టిన ప్రేక్షకులకు థాంక్స్’’ అన్నారు. హీరోయిన్ నిక్కి తంబోలి చిత్రవిజయం పట్ల తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. -
మా సినిమా యూత్‌కు మాత్రమే
ఆదిత్, నిక్కీ తంబోలి జంటగా, హేమంత్, ‘తాగుబోతు’ రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’. సంతోష్ పి.జయకుమార్ దర్శకత్వంలో బ్లూ ఘోస్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమా ఈనెల 21న విడుదలవుతోంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సంతోష్ పి.జయకుమార్ మాట్లాడుతూ– ‘‘17రోజుల్లో ఈ సినిమా పూర్తి చేశాం. ఇందుకు నటీనటులు, సాంకేతిక నిపుణుల సహకారం మరువలేనిది. 18 సంవత్సరాలు దాటిన వారు మాత్రమే చూడాల్సిన సినిమా ఇది. మా సినిమా ట్రైలర్, వీడియోస్‌కు చాలా మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ఆదిత్ మాట్లాడుతూ – ‘‘ఇలాంటి సినిమా ఎందుకు చేస్తున్నారని చాలా మంది అడిగారు. మాకు ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్స్ లేవు. రికార్డులు, రివార్డ్స్ లాంటివి కూడా లేవు. ఎవరూ చేయలేని స్క్రిప్ట్ చేయాలని అనుకుని చేసిన సినిమా ఇది. ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్‌కు కాదు.. యూత్‌కి మాత్రమే’’ అన్నారు. ‘‘ఇది ప్యూర్ అడల్ట్ మూవీ. దయచేసి ఫ్యామిలీతో వెళ్లొద్దు. ఆ విషయాన్ని ట్రైలర్లో కూడా చెప్పాం. తమిళంలోలా ఈ సినిమా తెలుగులోనూ పెద్ద హిట్ అవ్వాలి’’ అన్నారు నటుడు ‘సత్యం’ రాజేష్. ‘‘ఈ చిత్రంలో నేను కొత్తగా ఉండే పాత్ర చేశా. నన్ను నేను నిరూపించుకోవాలని చాలా కష్టపడ్డాను. ఆ పాత్రకు నాపేరు సూచించిన ‘సత్యం’ రాజేష్ అన్నకు థ్యాంక్స్. ’’ అని ‘తాగుబోతు’ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిక్కీ తంబోలి పాల్గొన్నారు. -
అప్పుడే నిండుదనం వస్తుంది
‘‘ఆర్టిస్టులు సినిమా పబ్లిసిటీకి కూడా రావాలి. అప్పుడే సినిమాకు నిండుదనం వస్తుంది. లేకపోతే మన సినిమాను మనమే కిల్ చేసుకున్నవాళ్లం అవుతాం. హరీష్‌కు ఓపిక ఎక్కువ. సినిమా పట్ల అతనికి ఉన్న ప్రేమ కోసమైనా ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి’’ అన్నారు నటుడు పృథ్వీ. హరీష్ కె.వి దర్శకత్వంలో పృథ్వీ, రాకేందు మౌళి, కల్పిక, కల్యాణ్, కృష్ణభగవాన్, తాగుబోతు రమేష్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘మై డియర్ మార్తాండం’. ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన విలేకర్ల సమావేశంలో రచయిత వెన్నెలకంటి మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాతో మా అబ్బాయి రాకేందు మౌళి హీరోగా పరిచయం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది. ఈ సినిమా దర్శకుడు హరీష్ తపన ఉన్న వ్యక్తి. చిన్న సినిమాను ఆడియన్స్ పెద్ద హిట్ చేయగలరు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ‘‘హీరోగా నా తొలి సినిమాలోనే ఇంతమంది ఆర్టిస్టులతో పని చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు రాకేందు మౌళి. ‘‘హరీష్ వల్ల ఈ సినిమాలో నాకు మంచి రోల్ వచ్చింది’’ అన్నారు కల్యాణ్. ‘‘మాకు పెద్ద దిక్కు పృ«థ్వీగారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. కోర్టు డ్రామాతో పాటు సినిమాలో మంచి కామెడీ ఉంది’’ అన్నారు హరీష్. -
లవ్.. యాక్షన్
అర్జున్ మహి హీరోగా, ‘శరణం గచ్ఛామి’ ఫేమ్ తనిష్క్ రాజన్ హీరోయిన్గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇష్టంగా’. సంపత్ వి.రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్ మూవీ వండర్స్ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అడ్డూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ వైవిధ్యంగా ఉంటుంది. యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సినిమాలో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దువ్వాసి మోహన్, ‘తాగుబోతు’ రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేస్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా. -
తెలంగాణ యాస వచ్చేసింది – అనసూయ
శ్రీనివాసరెడ్డి, అనసూయ, టిల్లు వేణు ముఖ్యతారలుగా శ్రీధర్‌రెడ్డి యార్వా దర్శకత్వంలో దీపక్ ముఖుత్, ఎన్.ఎం. షాషా నిర్మిస్తున్న సినిమా ‘సచ్చిందిరా... గొర్రె’. ప్రస్తుతం మూడో షెడ్యూల్ జరుగుతోంది. ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ–‘‘ఇష్టపడి, కష్టపడి చేసిన చిత్రమిది. నేను నల్గొండ అమ్మాయినే. కాకపోతే.. హైదరాబాద్‌లో పెరగడం వల్ల ఇక్కడి మాటతీరు వచ్చింది. అయితే.. ఈ సినిమా సెట్స్‌లోకి వెళ్లగానే తెలంగాణ యాస వచ్చేసింది’’ అన్నారు. ‘‘విభిన్న పాత్రలతో వినోదాత్మకంగా సాగే చిత్రమిది’’ అన్నారు శ్రీనివాస రెడ్డి. ‘‘నాలుగేళ్ల క్రితం శ్రీనివాసరెడ్డికి కథ చెప్పా. విభిన్నమైన కథ. తెరపై చూస్తుంటే అందమైన అనుభవంలా ఉంటుంది’’ అన్నారు శ్రీధర్‌రెడ్డి. ‘‘కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలను నిర్మించాలని వచ్చాం. ఈ సినిమా 50 శాతం పూర్తయింది. డిసెంబర్‌కి మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాతలు. నటులు తాగుబోతు రమేష్, టిల్లు వేణు, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు. -
బాగా నవ్వించే ఎ.కె.రావు-పి.కె.రావు
యువ హాస్యనటులు ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ హీరోలుగా మారారు. కోటపాటి శ్రీను దర్శకత్వంలో ‘ఎ.కె. రావు - పి.కె.రావు’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సాయి వెంకటేశ్వర కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది. మహూర్తపు దృశ్యానికి సాయికుమార్, ఆది కెమెరా స్విచాన్ చేయగా, రామ్ క్లాప్ కొట్టారు. నాని గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ పేర్కొన్నారు. పూర్తిస్థాయి హాస్యరస చిత్రమిదని, డిసెంబరుతో చిత్రీకరణ పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. కరీనా, శ్రీభూమిక నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ చౌదరి, స్వర్ణసుధాకర్, గుత్తి మల్లికార్జున్, కెమెరా: జి.శివకుమార్, సంగీతం: ఎస్.జె.