బాగా నవ్వించే ఎ.కె.రావు-పి.కె.రావు
యువ హాస్యనటులు ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ హీరోలుగా మారారు. కోటపాటి శ్రీను దర్శకత్వంలో ‘ఎ.కె. రావు - పి.కె.రావు’ పేరుతో ఓ సినిమా చేస్తున్నారు. సాయి వెంకటేశ్వర కంబైన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం సోమవారం హైదరాబాద్‌లో మొదలైంది.
మహూర్తపు దృశ్యానికి సాయికుమార్, ఆది కెమెరా స్విచాన్ చేయగా, రామ్ క్లాప్ కొట్టారు. నాని గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంటుందని ధన్‌రాజ్, తాగుబోతు రమేష్ పేర్కొన్నారు.
పూర్తిస్థాయి హాస్యరస చిత్రమిదని, డిసెంబరుతో చిత్రీకరణ పూర్తవుతుందని దర్శకుడు తెలిపారు. కరీనా, శ్రీభూమిక నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: శ్రీరామ్ చౌదరి, స్వర్ణసుధాకర్, గుత్తి మల్లికార్జున్, కెమెరా: జి.శివకుమార్, సంగీతం: ఎస్.జె.