లవ్‌.. యాక్షన్‌ | ishtanga movie press meet | Sakshi
Sakshi News home page

లవ్‌.. యాక్షన్‌

Published Mon, Aug 6 2018 12:46 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

ishtanga movie press meet - Sakshi

తనిష్క్‌ రాజన్‌, అర్జున్‌ మహి

అర్జున్‌ మహి హీరోగా, ‘శరణం గచ్ఛామి’ ఫేమ్‌ తనిష్క్‌ రాజన్‌ హీరోయిన్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇష్టంగా’. సంపత్‌ వి.రుద్ర దర్శకత్వంలో ఎ.వి.ఆర్‌ మూవీ వండర్స్‌ పతాకంపై అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ సినిమా ఒక్క పాట మినహా చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా అడ్డూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ– ‘‘లవ్, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. కథ వైవిధ్యంగా ఉంటుంది.

యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. ఈ సినిమాలో ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సెప్టెంబర్‌లో సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. దువ్వాసి మోహన్, ‘తాగుబోతు’ రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేస్వర్‌ నెమిలకొండ, ఫిష్‌ వెంకట్‌  తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి కెమెరా: ఆనంద్‌ నడకట్ల, సంగీతం: యేలేంద్ర మహీరా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement