రష్మిక మందన్నా.. నేషనల్ క్రష్ అని అర్థమవుతోందా? ఈ నేషనల్ క్రష్ మనసు దోచి ఆమె వార్డ్‌రోబ్‌లోకి చేరిన బ్రాండ్స్ ఏంటో చూద్దాం..
త్యానీ బై కరణ్ జోహార్
ప్రముఖ నిర్మాత, దర్శకుడు, రచయిత కరణ్ జోహార్ నిజంగా బహుముఖ ప్రజ్ఞాశాలి. తన అద్భుతమైన ఆలోచనతో సూపర్ హిట్ సినిమాలనే కాదు, అందమైన ఆభరణాలకూ రూపకల్పన చేయగలడని నిరూపించాడు. నిదర్శనం 2017లో ప్రారంభించిన ‘త్యానీ బై కరణ్ జోహార్ జ్యూయెలరీ’. బంగారం, వజ్రాలతో తయారుచేసిన ఈ ఆభరణాలు ఎంతోమంది సెలబ్రిటీల ఫేవరెట్.
చూడటానికి ఈ ఆభరణాల మెరుపు రాత్రివేళ ఆకాశంలో మెరిసే నక్షత్రాలను తలపిస్తే, వీటి ధరలు పట్టపగలే చుక్కలు చూపిస్తాయి. ఇక్కడ ఏది కొనాలన్నా లక్షల నుంచి కోట్లు ఖర్చు చేయాల్సిందే. బంగారం ధర, వజ్రాల నాణ్యతతో సంబంధం ఉండదు. కేవలం డిజైన్ ఆధారంగానే ధర నిర్ణయిస్తారు. ప్రముఖ ఆన్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ఆభరణాలను కొనుగోలు చేయొచ్చు.
జ్యూయెలరీ
బ్రాండ్: త్యానీ బై కరణ్ జోహార్
నెక్‌పీస్ ధర : రూ. 2,86,300
ఉంగరం ధర: రూ. 97,610
అశ్విని రెడ్డి
హైదరాబాద్‌కు చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్.. టాప్‌మోస్ట్ ఫ్యాషన్‌గా డిజైనర్‌గా ఎదిగింది. బీటెక్ తర్వాత ఎన్‌ఐఎఫ్‌టీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తయ్యాక, ఇటలీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో స్పెషలైజేషన్ చేసింది అశ్విని రెడ్డి. 2009లో తన పేరు మీదే హైదరాబాద్‌లో ఫ్యాషన్ హౌస్‌ను ప్రారంభించింది. వెస్టర్న్ లుక్‌కు సంప్రదాయ శైలితో కూడిన ఎంబ్రాయిడరీ జోడిస్తూ ఎన్నో కలెక్షన్స్‌ను రూపొందించింది. కొద్దిరోజుల్లోనే ఆమె డిజైన్స్ పాపులర్ కావడంతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది.
2018 లాక్మే ఫ్యాషన్ వీక్‌లో ప్రదర్శించిన ‘తిలోత్తమ కలెక్షన్స్’తో ఆమె ఇంటర్నేషనల్ ఫ్యాషన్ డిజైనర్స్‌లో ఒకరిగా గుర్తింపు పొందింది. ఇంటర్నేషనల్ డిజైనర్ అంటే ధర కూడా ఆ స్థాయిలోనే ఉంటుంది అనుకోకండి. కాస్త సరసమైన ధరల్లోనే లభిస్తాయి. ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైనర్ వేర్ అందుబాటులో ఉంది.
చీర డిజైనర్ : అశ్విని రెడ్డి
ధర: రూ. 48,000
►షాప్‌కి వెళ్లి, సెలక్ట్ చేసుకుని, ట్రై చేయడం.. నాకు చాలా కష్టం. కన్‌ఫ్యూజ్ అయిపోతా. అందుకే, ఎక్కువగా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తుంటాను – రష్మిక మందన్నా.
-దీపిక కొండి
Comments
Please login to add a commentAdd a comment