ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి? | MBA (IT) and Levi IIM offer? | Sakshi
Sakshi News home page

ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి?

Published Thu, Aug 7 2014 2:48 AM | Last Updated on Tue, Oct 16 2018 2:53 PM

ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి? - Sakshi

ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి?

బీటెక్ (మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్ లేవి? ప్రవేశ ప్రక్రియ ఎలా ఉంటుంది?
  -రాజేష్, సూర్యాపేట.
 బీటెక్ (మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) కోర్సులో బయోఫిజికల్ టెక్నిక్స్, బయో మెటీరియల్ సైన్స్, స్టాటిస్టికల్ థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్ అండ్ కైనటిక్స్ ఆఫ్ మెటీరియల్స్, ప్రాసెసింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ మెటీరియల్స్, నానో సైన్స్ అండ్ ఇంజనీరింగ్, అడ్వాన్స్‌డ్ మెటీరియల్ అండ్ అప్లికేషన్స్ తదితర అంశాలు ఉంటాయి.
 
 ఈ కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)- కాన్పూర్
     అర్హత: ఇంటర్మీడియెట్ (ఎంపీసీ).
     {పవేశం: జేఈఈ-అడ్వాన్స్‌డ్ ఆధారంగా.
     వివరాలకు: www.iitk.ac.in
     అన్నా యూనివర్సిటీ - తమిళనాడు
     అర్హత: ఇంటర్మీడియెట్ (10+2) ఉత్తీర్ణత
     {పవేశం: రాత పరీక్ష ఆధారంగా
     వివరాలకు: www.annauniv.edu
 
 యూనివర్సిటీ ఆఫ్ ఎనర్జీ అండ్ పెట్రోలియం స్టడీస్ (యూపీఈఎస్)- డెహ్రాడూన్.
 అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ (ఎంపీసీ) తోపాటు 10వ తరగతిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌లలో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.ప్రవేశం: యూపీఈఎస్ ఇంజనీరింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఆధారంగా లేదా ఇంటర్ మార్కులు ఆధారంగా.వివరాలకు: www.upes.ac.in
 
 సీఎస్‌ఐఆర్ ఫెలోషిప్స్
 కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్).. ఎస్‌ఆర్‌ఎఫ్ (సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్), సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (ఎక్స్‌టెన్డెడ్), రీసెర్చ్ అసోసియేటిషిప్ (ఆర్‌ఏ)ల కోసం ప్రకటన విడుదల చేసింది. వివరాలు..
 
 ఎస్‌ఆర్‌ఎఫ్ (సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)
 అందజేస్తున్న విభాగాలు: మెడికల్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ, లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్, ఫిజికల్ సెన్సైస్, మెటీరియల్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌స, ఆర్గానిక్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్.
 
 ఫెలోషిప్ కాల వ్యవధి: మూడు నుంచి నాలుగేళ్లు.
 స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు మొదటి మూడేళ్లు నెలకు రూ. 18 వేలు చెల్లిస్తారు. మెడికల్/వెటర్నరీ/ఫార్మసీ అభ్యర్థులకు మొదటి రెండేళ్లు నెలకు రూ. 18 వేలు తర్వాత ఏడాది నెలకు రూ. 20 వేలు అందజేస్తారు. అంతేకాకుండా కంటిన్‌జెన్సీ ఫండ్ కింద సంవత్సరానికి రూ. 20 వేలు మంజూరు చేస్త్తారు.అర్హత: ఎంటెక్/ఎంఈ/బీఈ/బీటెక్/బీఫార్మసీ/బీవీఎస్సీ/ బీఎస్సీ (అగ్రికల్చర్)/ఎంబీబీఎస్/బీడీఎస్/ఎంఫార్మసీ/ఎంవీఎస్సీ/ఎంఎస్సీ (అగ్రికల్చర్)/తత్సమానం. వయసు: 32 ఏళ్లు.
 
 సీనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ (ఎక్స్‌టెన్డెడ్)
 అందజేస్తున్న విభాగాలు: మెడికల్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ, లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్, ఫిజికల్ సెన్సైస్, మెటీరియల్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌స, ఆర్గానిక్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్.అర్హత: పీహెచ్‌డీ/ఎండీ/ఎంఎస్/ఎండీఎస్ విభాగాల్లో థిసిస్‌ను సమర్పించిన అభ్యర్థులు.
 
 వయసు: 33 ఏళ్లు.
 కాల పరిమతి: ఏడాది
 ఫెలోషిప్: ఏడాదిపాటు నెలకు రూ. 20 వేలు
 
 రీసెర్చ్ అసోసియేట్‌షిప్
 అందజేస్తున్న విభాగాలు: మెడికల్, ఫార్మాస్యూటికల్ సెన్సైస్, వెటర్నరీ, లైఫ్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్, ఫిజికల్ సెన్సైస్, మెటీరియల్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్‌‌స, ఆర్గానిక్, ఎర్త్, ఓషన్, అట్మాస్ఫియరిక్ అండ్ ప్లానెటరీ సెన్సైస్, మ్యాథమెటికల్ సెన్సైస్.
 
 కాల వ్యవధి: మూడేళ్లు.
 స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు మొదటి ఏడాది నెలకు రూ.22వేలు, రెండో ఏడాది నెలకు రూ.23వేలు, మూ డో ఏడాది నెలకు రూ.24 వేలు చెల్లిస్తారు. కంటిన్‌జెన్సీ ఫండ్ కింద సంవత్సరానికి రూ.20వేలు అందజేస్తారు.అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ లేదా ఎండీ/ఎంఎస్/ఎండీఎస్/ ఎంఎస్సీ/ఎంఈ/ఎంటెక్. కనీసం మూడేళ్ల అనుభవం ఉండాలి.
 
 వయసు: 35 ఏళ్లు.
 ఎంపిక విధానం: మెరిట్ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు నిర్వహించే ఇంటర్వ్యూ ద్వారా
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి చేసిన దరఖాస్తును ప్రింట్ తీసి సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి నిర్దేశిత చిరునామాకు పంపాలి.
 ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబర్ 2, 2014.
 ప్రింట్ అవుట్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ: సెప్టెంబర్ 8, 2014.
 వివరాలకు: www.csirhrdg.res.in
 
 బయోటెక్నాలజీ స్పెషలైజేషన్‌తో అందుబాటులో ఉన్న మేనేజ్‌మెంట్ కోర్సు వివరాలు?    -చంద్ర, కరీంనగర్..ఔషధాలకు సంబంధించి రీసెర్చ్, అనుబంధ కార్యక్రమాలు విస్తృతమవుతుండటంతో ఇటీవల బయోటెక్ పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలు ఊపందుకున్నారుు. కంపెనీలు తమ మార్కెటింగ్ కార్యకలాపాల కోసం స్పెషలైజ్డ్ ఎగ్జిక్యూటివ్‌లు, మార్కెటింగ్ మేనేజర్లను రిక్రూట్ చేసుకుంటున్నాయి. దీన్ని గుర్తించిన కొన్ని విద్యా సంస్థలు ఈ విభాగంలో పలు మేనేజ్‌మెంట్ కోర్సులకు రూపకల్పన చేశారుు.
 
 ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజ్-హైదరాబాద్
 కోర్సు: పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్- బయోటెక్నాలజీ
 అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్
 ప్రవేశం: క్యాట్/ఎక్స్‌ఏటీ/మ్యాట్/ఏటీఎంఏ/ఐసెట్ స్కోర్‌తోపాటు గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా. వివరాలకు: www.ipeindia.org
     యూనివర్సిటీ ఆఫ్ పుణె
     కోర్సు: ఎంబీఏ-బయోటెక్నాలజీ
     అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి సైన్స్‌లో మాస్టర్స్/బ్యాచిలర్స్ డిగ్రీ.
     వివరాలకు: www.unipune.ac.in
     డీవై పాటిల్ యూనివర్సిటీ-నవీ ముంబై
     వివరాలకు: dypatil.in
 
 ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి?
 -స్రవంతి, మెదక్.
 ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఎంబీఏ(ఐటీ)కి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి టాప్ ఎంఎన్‌సీలలో.. ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ డిజైనర్/ఆర్కిటెక్ట్, డేటా అనాలిస్ట్, అప్లికేషన్ సపోర్ట్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రాసెస్ మేనేజర్ వంటి అవకాశాలు ఉంటాయి. పలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) లు ఎంబీఏ(ఐటీ)/తత్సమాన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. క్యాట్ స్కోర్, జీడీ/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం లభిస్తుంది.
 
 అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
     కోర్సు: పీజీపీ(కంప్యూటర్ - ఇన్ఫర్మేషన్ సిస్టమ్)
     వివరాలకు: www.iimahd.ernet.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-బెంగళూరు
     కోర్సు: పీజీపీ (సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్)
     వివరాలకు: www.iimb.ernet.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కోజికోడ్
     వివరాలకు: www.iimk.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కోల్‌కతా
     కోర్సు: పీజీపీ(కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్)
     వివరాలకు: www.iimcal.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో
     వివరాలకు: www.iiml.ac.in
 
 ఎంబీఏ(ఐటీ)ని ఆఫర్ చేస్తున్న ఐఐఎం లేవి?
 -స్రవంతి, మెదక్.
 ప్రస్తుతం జాబ్ మార్కెట్‌లో ఎంబీఏ(ఐటీ)కి మంచి డిమాండ్ ఉంది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి మైక్రోసాఫ్ట్, టీసీఎస్, ఇన్ఫోసిస్, ఐబీఎం వంటి టాప్ ఎంఎన్‌సీలలో.. ప్రాజెక్ట్ మేనేజర్, సిస్టమ్ డిజైనర్/ఆర్కిటెక్ట్, డేటా అనాలిస్ట్, అప్లికేషన్ సపోర్ట్ అనలిస్ట్, సొల్యూషన్ ఆర్కిటెక్ట్, ప్రాసెస్ మేనేజర్ వంటి అవకాశాలు ఉంటాయి. పలు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) లు ఎంబీఏ(ఐటీ)/తత్సమాన కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. క్యాట్ స్కోర్, జీడీ/రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశం లభిస్తుంది.
 
 అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
           ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-అహ్మదాబాద్
     కోర్సు: పీజీపీ(కంప్యూటర్ - ఇన్ఫర్మేషన్ సిస్టమ్)
     వివరాలకు: www.iimahd.ernet.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-బెంగళూరు
     కోర్సు: పీజీపీ (సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజ్ మేనేజ్‌మెంట్)
     వివరాలకు: www.iimb.ernet.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్- కోజికోడ్
     వివరాలకు: www.iimk.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-కోల్‌కతా
     కోర్సు: పీజీపీ(కంప్యూటర్ ఎయిడెడ్ మేనేజ్‌మెంట్)
     వివరాలకు: www.iimcal.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్-లక్నో
     వివరాలకు: www.iiml.ac.in
 
 పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ పరీక్ష వివరాలను తెలపండి?
 -తేజ, సిర్పూర్.
 టోఫెల్, ఐఎల్‌టీఈఎస్ మాదిరిగానే విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలనుకునే అభ్యర్థుల ఆంగ్ల భాష పరిజ్ఞానాన్ని పరీక్షించడానికి ఉద్దేశించిన పరీక్ష పియర్సన్ టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్. ఇందులో రిటెన్ టెస్ట్, స్పోకెన్ టెస్ట్ అనే విభాగాలు ఉంటాయి. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా యూఎస్, యూకే, ఆస్ట్రేలియాలలోని కొన్ని విశ్వవిద్యాలయాలు ప్రవేశాలు కల్పిస్తున్నాయి. ఈ టెస్ట్‌కు హాజరవ్వాలనుకునే అభ్యర్థులు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ రెండు పనిదినాల్లో వస్తుంది. ఆ తర్వాత టెస్ట్ డేట్, సెంటర్‌ను బుక్ చేసుకోవాలి. ప్రిపరేషన్ మెటీరియల్, ఆన్‌లైన్ రిసోర్సెస్, స్కోర్‌‌స, యూనివర్సిటీలు తదితర
 వివరాలకు: www.pearsonpte.com
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement