రాజాం : శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొత్తవలస గ్రామం సమీపంలో ఎంబీయే విద్యార్థిని సోమవారం ఆత్మహత్యాయత్నం చేసింది. బాడంగి మండలానికి చెందిన ఓ యువతి విశాఖపట్నంలో ఎంబీయే చదువుతోంది. ఆమెకు కొత్తవలసకు చెందిన ఓ వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ప్రియుడిని కలిసేందుకు సోమవారం కొత్తవలసకు చేరుకున్న ఆమె... పురుగుల ముందు సేవించి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రేమ విఫలమే కారణంగా తెలుస్తోంది.