Jay Kotak Shares Tweet About His Fiancee Aditi Arya MBA Graduation, Post Viral - Sakshi
Sakshi News home page

Jay Kotak: చాలా గర్వంగా ఉంది.. కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్

Published Thu, May 25 2023 5:32 PM | Last Updated on Thu, May 25 2023 7:24 PM

Jay Kotak tweet to aditi arya mba graduation post viral - Sakshi

ప్రముఖ బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు 'జే కోటక్' గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఇతడు ఇటీవల తన కాబోయే భార్యకు అభినందనలు తెలుపుతూ ట్విటర్ పోస్ట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

జే కోటక్ మాజీ మిస్ ఇండియా 'అదితి ఆర్య'ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు కాబోయే భార్య యేల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సందర్భములో అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ నా ఫియాన్సీ MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. నేను చాలా గర్వపడుతున్నాను అంటూ మే 24న పోస్ట్ చేసాడు. ఇందులో అదితి గ్రాడ్యుయేషన్ దుస్తులలో ఉండటం కూడా చూడవచ్చు.

జే కోటక్ కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి బీఏ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం డిజిటల్ బ్యాంక్ కోటక్811కి కో-హెడ్ పదవిలో ఉన్నారు. 2022 ఆగస్ట్ నెలలో జే కోటక్ అండ్ అదితి ఆర్య నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. నిశ్చితార్థం తర్వాత పారిస్‌లోని ఐఫిల్ టవర్ ముందు పోజులిస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వారు దీనిని ధ్రువీకరించలేదు. కానీ ఇప్పుడు వీరి జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనట్లు చెప్పకనే చెప్పేసారు.

(ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?)

ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ పూర్తి చేసిన అదితి ఆర్య 2015లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తరువాత యేల్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా పయనమైంది. అంతకంటే ముందు ఈమె తెలుగు, హిందీ సినిమాల్లో కూడా కనిపించింది. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఇక జే కోటక్ & అదితి ఆర్యల వివాహం ఎప్పుడనేది తెలియాల్సిన విషయం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement