Kotak Group
-
మాజీ మిస్ ఇండియాను పెళ్లి చేసుకున్న ఉదయ్ కోటక్ కుమారుడు
ప్రసిద్ధ కోటక్ బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్‌కోటక్ కుమారుడు జైకోటక్ మాజీ మిస్ ఇండియాను పెళ్లిచేసుకున్నట్లు తెలిసింది. ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్లో మంగళవారం వివాహం జరిగినట్లు కథనాలు వస్తున్నాయి. ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన ‘అంబానీ_అప్డేట్’ ఇన్‌స్టా హ్యాండిల్లో అంబానీ దంపతులు వివాహానికి హాజరైన చిత్రాలను పోస్ట్ చేసినట్లు తెలిసింది. మే 24, 2023లో జైకోటక్ తనకు కాబోయే భార్య అదితిఆర్య(మాజీ మిస్ ఇండియా) యేల్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిందని తన ఎక్స్‌ఖాతాలో పోస్ట్ చేశారు. జైకోటక్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి బీఏ పట్టా పొందారు. అదితిఆర్య దిల్లీ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ సాధించింది. 2015లో అదితి మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని సొంతం చేసుకున్నారు. ఎంబీఏ చదివేందుకు యూఎస్ వెళ్లడానికి ముందు కొన్ని హిందీ, కన్నడ సినిమాలతో పాటు తెలుగులో కల్యాణ్‌రామ్‌తో కలిసి ఇజం సినిమాలో నటించారు. Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) -
కాబోయే భార్య గురించి ట్వీట్ చేసిన జే కోటక్ - వైరల్ అవుతున్న పోస్ట్
ప్రముఖ బిలియనీర్ బ్యాంకర్ ఉదయ్ కోటక్ కుమారుడు 'జే కోటక్' గురించి దాదాపు అందరికి తెలిసిందే. అయితే ఇతడు ఇటీవల తన కాబోయే భార్యకు అభినందనలు తెలుపుతూ ట్విటర్ పోస్ట్ చేసాడు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం. జే కోటక్ మాజీ మిస్ ఇండియా 'అదితి ఆర్య'ని వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. అంత కంటే ముందు కాబోయే భార్య యేల్ యూనివర్శిటీ నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన సందర్భములో అభినందనలు తెలిపాడు. దీనికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ అకౌంట్ ద్వారా షేర్ చేస్తూ నా ఫియాన్సీ MBA గ్రాడ్యుయేట్ పూర్తి చేసింది. నేను చాలా గర్వపడుతున్నాను అంటూ మే 24న పోస్ట్ చేసాడు. ఇందులో అదితి గ్రాడ్యుయేషన్ దుస్తులలో ఉండటం కూడా చూడవచ్చు. జే కోటక్ కూడా కొలంబియా యూనివర్సిటీ నుంచి బీఏ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ప్రస్తుతం డిజిటల్ బ్యాంక్ కోటక్811కి కో-హెడ్ పదవిలో ఉన్నారు. 2022 ఆగస్ట్ నెలలో జే కోటక్ అండ్ అదితి ఆర్య నిశ్చితార్థం జరిగినట్లు పుకార్లు వచ్చాయి. నిశ్చితార్థం తర్వాత పారిస్‌లోని ఐఫిల్ టవర్ ముందు పోజులిస్తున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. కానీ వారు దీనిని ధ్రువీకరించలేదు. కానీ ఇప్పుడు వీరి జంట త్వరలోనే పెళ్లి పీటలెక్కనట్లు చెప్పకనే చెప్పేసారు. (ఇదీ చదవండి: పట్టుమని పాతికేళ్ళు లేవు.. కోట్లు విలువ చేసే కార్లు, కారవ్యాన్, హెలికాఫ్టర్స్ - ఎవరీ యువ బిలీనియర్?) Aditi, my fiancée, completed her MBA from Yale University today. Immensely proud of you @AryaAditi pic.twitter.com/xAdcRUFB0C — Jay Kotak (@jay_kotakone) May 24, 2023 ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన షహీద్ సుఖ్‌దేవ్ కాలేజ్ ఆఫ్ బిజినెస్ స్టడీస్ పూర్తి చేసిన అదితి ఆర్య 2015లో మిస్ ఇండియా వరల్డ్ కిరీటాన్ని దక్కించుకుంది. ఆ తరువాత యేల్ యూనివర్శిటీలో చదువుకోవడానికి అమెరికా పయనమైంది. అంతకంటే ముందు ఈమె తెలుగు, హిందీ సినిమాల్లో కూడా కనిపించింది. ఇప్పుడు అమెరికా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసింది. ఇక జే కోటక్ & అదితి ఆర్యల వివాహం ఎప్పుడనేది తెలియాల్సిన విషయం. -
సాధారణ బీమా రంగంలోకి కొటక్ గ్రూప్
ముంబై: కొటక్ మహీంద్రా బ్యాంక్ మంగళవారం సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించింది. ఈ రంగంలో సంస్థ రూ. 100 కోట్లు పెట్టుబడులుగా పెట్టనుందని బ్యాంక్ ప్రెసిడెంట్ (అసెట్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, ఇంటర్నేషనల్ మేనేజ్మెంట్) గౌరంగ్ షా ఇక్కడ తెలిపారు. ‘‘సాధారణ బీమా రంగంలోకి ప్రవేశించడానికి ఇప్పటికే రెగ్యులేటర్ ఐఆర్డీఏ నుంచి అనుమతి పొందాము. ఇందుకు సంబంధించి అనుబంధ సంస్థ ఏర్పాటుకు రిజర్వ్ బ్యాంక్ నుంచి తాజాగా అనుమతి లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికం నుంచీ సంస్థ సాధారణ బీమా సేవలు ప్రారంభమవుతాయని భావిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. కొటక్ ప్రవేశంతో సార్వత్రిక బీమా రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థల సంఖ్య 27కు చేరింది. ప్రస్తుతం వెంచర్లో విదేశీ భాగస్వామ్యం కోసం చూడబోమని, భవిష్యత్తులో అవసరమైతే ఆలోచిస్తామని ఈ సందర్భంగా గౌరంగ్ అన్నారు.తాజా అనుబంధ విభాగం ద్వారా మొదటి ఐదేళ్లలో రూ.900 కోట్ల ప్రీమియంలు సమీకరించాలన్నది లక్ష్యమని షా తెలిపారు. కాగా 250 మంది సిబ్బందిని కొత్త వెంచర్ కార్యకలాపాల కోసం ఎంపిక చేసుకోనున్నట్లు జనరల్ ఇన్సూరెన్స్ వెంచర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మహేశ్ బాలసుబ్రమణియన్ ఈ సందర్భంగా తెలిపారు.