ఎంబీఏ విభాగంలో ముగిసిన జాతీయసదస్సు
Published Wed, Mar 1 2017 12:04 AM | Last Updated on Tue, Nov 6 2018 5:13 PM
ఎస్కేయూ : వర్సిటీ ఎంబీఏ విభాగంలో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ సదస్సు మంగళవారం ముగిసింది. కార్యక్రమానికి ఎస్కేయూ రెక్టార్ ఆచార్య లజపతిరాయ్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంతర్జాతీయ వాణిజ్య విధానంలో భారత్ అవలంభించిన విధానాలు విద్యార్థులకు తెలియ చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు అంతర్జాతీయ వాణిజ్యం పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచార్య కే.సుధాకర్ బాబు, ఫిజిస్తు కంపెనీ డిప్యూటీ మేనేజర్ మనోహర్ రెడ్డి, ప్రోగ్రాం కో ఆర్డినేటర్ అనిత తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement