బీజేపీ అభ్యర్థిగా ప్రకటించిన మణికుట్టన్ (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
తిరువనంతపురం: వచ్చే నెల కేరళలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో పార్టీలన్ని తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేసున్నాయి. బీజేపీ ఆదివారం తన క్యాండెట్స్ లిస్ట్‌ని విడుదల చేసింది. అయితే ఆశ్చర్యంగా ఈ లిస్ట్‌లో ఓ సామన్యుడి పేరు ప్రకటించింది. వయనాడ్ జిల్లాలోని మనంతవాడి నియోజకవర్గం నుంచి ఎంబీఏ గ్రాడ్యుయేట్ మణికుట్టన్ బరిలో నిలుస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో నిన్న అంతా ఒకటే చర్చ. ఎవరీ మణికుట్టన్.. బీజేపీ తన అభ్యర్థిగా అతడిని ఎందుకు ప్రకటించింది అనే దాని గురించి రకరకాల వార్తలు ప్రచారం అయ్యాయి.
వీటిపై తాజాగా మణికుట్టన్ స్పందించారు. బీజేపీ అభ్యర్థుల జాబితాలో తన పేరు చూసి ఆశ్చర్యపోయానని.. రాజకీయాలకు తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తన పేరు ఎందుకు ప్రకటించారో ఇంకా తనకు అర్థం కావడం లేదని.. కానీ తాను మాత్రం ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తెలిపారు. ఈ సందర్భంగా మణికుట్టన్ మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బీజేపీ నాయకత్వం తమ అభ్యర్థిగా నా పేరు ప్రకటించింది. నేనొక సాధారణ పౌరుడిని. అలాంటిది టీవీలో బీజేపీ అభ్యర్థుల జాబితాలో నా పేరు రావడం చూసి ఆశ్చర్య పోయాను.. చాలా భయపడ్డాను కూడా. ఆ తర్వాత పనియా సామాజిక వర్గానికి అవకాశం ఇచ్చినందకు చాలా సంతోషపడ్డాను. అయితే రాజకీయాల్లోకి రావాలని నాకు ఏమాత్రం ఆసక్తి లేదు. ఉద్యోగం, కుటుంబం ఇదే నా ప్రపంచం. అందుకే బీజేపీ ఇచ్చిన అవకాశాన్ని నేను వినమ్రంగా తిరస్కరిస్తున్నాను. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. బీజేపీ నాయకులకు ఫోన్ చేసి ఈ విషయాన్ని తెలియజేశాను అన్నారు.
గత ఎన్నికల్లో కేరళలో బీజేపీ కేవలం ఒక్క చోట మాత్రమే విజయం సాధించింది. ఈ సారి ఈ సంఖ్యను పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది. దానిలో భాగంగానే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో మ్యాన్ ఈ. శ్రీధరన్ పేరును ప్రకటించింది బీజేపీ. ఆయన క్లీన్ ఇమేజ్ తమకు కలిసి వస్తుందని ఆ పార్టీ అభిప్రాయపడుతోంది. ఏప్రిల్ 6న కేరళలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారు. మే 2న లెక్కిస్తారు.
చదవండి:
అత్తింటి వేధింపులు: బీజేపీ ఎంపీ కోడలి ఆత్మహత్యాయత్నం
Comments
Please login to add a commentAdd a comment